Vidadala Rajini and Adimulapu Suresh: విశాఖపట్నంలో జీ 20 దేశాల సదస్సు నిర్వహణపై తుది సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఇన్చార్జ్ మంత్రి విడదల రజని, మంత్రి గుడివాడ అమర్నాథ్ తదితరలు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. రాజధాని విశాఖ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా కొత్త మహానగరంగా తీర్చిదిద్దుతాం అన్నారు.. భవిష్యత్తులో విశాఖ మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ కానుందన్న ఆయన.. అభివృద్ధి వికేంద్రీకరణ విధానానికి అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తున్నాం అన్నారు.. జీ 20 కోసం చేసిన అభివృద్ధి పనులు శాశ్వత ప్రాతిపదికన పలు అభివృద్ధి పనులు చేపట్టాం అన్నారు. నిర్వహణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు వివరించారు. రూ. 130 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. 600 కిలోమీటర్ల మేర కొత్త రోడ్లు, మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి. పరిపాలన రాజధానికి తగ్గట్టుగా అభివృద్ధి పనులు జరిగాయి. రాబోయే రోజుల్లో విశాఖ బ్రాండ్ ఇమేజ్ పెరగనుందన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్.
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
ఇక, G-20 అంతర్జాతీయ సదస్సు ఏర్పాట్లలో భాగంగా సీతకొండ వ్యూ పాయింట్, సుందదీకరణ పనులను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. తదితరులు పరిశీలించారు.. విశాఖ నగరంలో శాశ్వత అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మంత్రి విడడల రజినీ స్పష్టం చేశారు. కేవలం జీ20 సదస్సు కోసం కాకుండా విశాఖ శాశ్వత అభివృద్ధికి పనులు జరుగుతున్నాయన్నారు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హయాంలో విశాఖ విశ్వఖ్యాతి గడిస్తోందన్న ఆమె.. ఈ 28వ తేదీన జీ20 సదస్సుకు సీఎం వైఎస్ జగన్ హాజరవుతారని తెలిపారు..