Pensions Distribution in Ap: ఏపీలో పెన్షన్ వారోత్సవాలు.. వేగంగా సాగుతున్న పంపిణీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి నెల ఒకటవ తేదీ వచ్చిందంటే చాలు ఏపీలో వాలంటీర్లు బిజీ అయిపోతారు. తెల్లవారకముందే తలుపు తట్టి మరీ పెన్షన్లు అందచేస్తుంటారు. 2023 నూతన సంవత్సరం వేళ వాలంటీర్లు పెన్షన్ల పంపిణీలో బిజీగా వున్నారు. నూతన సంవత్సరం రోజు తెల్లవారుజాము నుంచి రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పండుగ కొనసాగుతుంది. కొత్త సంవత్సరంతో పాటే రాష్ట్రంలో పింఛన్ వారోత్సవాలు మొదలయ్యాయి. కోట్లాది రూపాయలు పంపిణీ చేస్తున్నారు.
లక్షలాది మంది అవ్వాతాతలు, వితంతు, ఒంటరి మహిళ, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల ఇళ్లలో కొత్త వెలుగులు వచ్చేశాయి. ఇప్పటి వరకు ప్రతి నెలా రూ.2,500 చొప్పున అందుకుంటున్న పింఛను డబ్బులు ఈరోజు నుంచి ప్రతి నెలా రూ.2,750 చొప్పున అందుకుంటున్నారు.
Also Read
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
వైయస్ జగన్ ప్రభుత్వం పెంచిన పెన్షన్ మొత్తం 2,750 రూపాయలు వాలంటీర్లు లబ్ధిదారులకు అందజేస్తున్నారు. మరోవైపు ఈ నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 2,31,989 మందికి వైయస్ జగన్ ప్రభుత్వం కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. జనవరి 3వ తేదీన సీఎం వైయస్ జగన్ రాజమండ్రిలో పింఛను పెంపు వారోత్సవ కార్యక్రమంలో స్వయంగా పాల్గొని లబ్ధిదారులతో మాట్లాడనున్నారు. రాష్ట్రంలో రికార్డు స్థాయికి చేరాయి పెన్షన్లు. 64.06 లక్షలకు చేరాయి పింఛన్లు.
ప్రభుత్వం తాజాగా మంజూరు చేసిన 2,31,989 పింఛన్లతో కలిపి జనవరి నెలలో రాష్ట్రంలో సామాజిక పింఛన్ల లబ్ధిదారుల సంఖ్య 64,06,240కి చేరుకుంది. నేడు జనవరి 1వ తేదీ ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ.. తెల్లవారుజాము నుంచే వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి పెరిగిన పింఛను డబ్బులు అందజేస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం శనివారమే అన్ని గ్రామ, వార్డు సచివాలయ శాఖల బ్యాంకు ఖాతాల్లో రూ.1,765 కోట్ల నిధులను జమ చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీ కొనసాగుతోందని డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు తెలిపారు. 64.06 లక్షల మంది పెన్షనర్లకు రూ.1765.04 కోట్లు విడుదల.. తెల్లవారుజాము నుంచే ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేస్తున్న వాలంటీర్లు.. ఉదయం 08.00 గంటల వరకు 47.12 శాతం పెన్షన్ల పంపిణీ.. 30.18 లక్షల మందికి రూ.830.94 కోట్లు అందచేశామన్నారు.
Read Also: Kim Jong Un: శక్తివంతమైన అణ్వాయుధాలను సిద్ధం చేయండి.. అమెరికాకు కిమ్ పరోక్ష హెచ్చరికలు
తాజావార్తలు
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!