చీప్ లిక్కర్ రూ.50కే..! ఇది బీజేపీ జాతీయ విధానమా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చీప్ లిక్కర్‌పై తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారిపోయాయి.. ఏపీలో తాము అధికారంలోకి వస్తే రూ.70 కే చీప్ లిక్కర్ అందిస్తాం.. ఆర్థిక పరిస్థితి మెరుగైదే రూ.50కే చీప్ లిక్కర్ అందిస్తామని ఆయన చేసిన వ్యాఖ్యలను అంతా ట్రోల్ చేస్తున్నారు.. అయితే.. సోము వీర్రాజు వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షుడు శైలజానాథ్.. చీప్ లిక్కర్‌ను రూ.50కి సరఫరా చేయాలనేదే బీజేపీ జాతీయ విధానమా? అని ప్రశ్నించిన ఆయన.. నిరాశ అధికంగా ఉన్న రాష్ట్రాలకు మాత్రమే బీజేపీ ఈ బంపర్ ఆఫర్ ఇస్తుందా? అంటూ ఎద్దేవా చేశారు.
Read Also: వంగవీటి రాధాపై రెక్కీ.. సీరియస్‌గా స్పందించిన టీడీపీ సీనియర్ నేత
Also Read
- AP Doctors: విధులకు గైర్హాజరైన 43 మoది డాక్టర్ల డిస్మిస్.. మరో 34 మంది రాజీనామా..
- Sai Krishna Incident: సాయికృష్ణ ఘటనపై సీఎం సీరియస్.. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశాలు
- Beach Shacks in AP: గోవా తరహాలో ఏపీ బీచ్‌లలో బార్లు.. మార్గదర్శకాలు జారీ
- Shyamala: శాంతిభద్రతలపై మౌనం.. మేకప్‌పై స్పందన.. హోంమంత్రి వ్యాఖ్యలకు ఆరే శ్యామల కౌంటర్..
ఇక, బీజేపీ చీప్ డ్రామాలు కట్టిపెట్టాలని సూచించారు శైలజానాథ్.. ప్రత్యేక హోదాపై ఏపీ బీజేపీ నేతలు ఎందుకు ప్రశ్నించరు..? భయమా..? అంటూ నిలదీసిన ఆయన.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై నోరు మెదపరా..? అని నిలదీశారు.. డ్రామా ఆర్టిస్టుల్లా సోము వీర్రాజు వ్యాఖ్యలున్నాయని.. మందు పోసి ఓట్లు అడుక్కునే దుస్థితికి రాష్ట్ర బీజేపీ దిగజారిందని ఎద్దేవా చేశారు.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ పై నోరు విప్పలేని బీజేపీ నేతలు మద్యం తక్కువ ధరకు ఇస్తామన్న ప్రకటనలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమువీర్రాజు పిచ్చి పరాకాష్టకు చేరింది… అమరావతిపై బీజేపీ నేతలు డ్రామాలాడుతున్నారంటూ ఫైల్ అయ్యారు శైలజానాథ్.
తాజావార్తలు
-
NEET Re Exam: నీట్ రీ-ఎగ్జామ్‌కు ముందు విషాదం.. 19 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య..
-
Fahadh Faasil : ‘దృశ్యం 3’ నిర్మాతలతో ఫహద్ ఫాసిల్ క్రేజీ డీల్… వరుస ప్రాజెక్టులు
-
Hyderabad: ఫ్రీజర్‌లో పురుగులు, స్టోరేజ్‌లో బల్లులు.. ‘లా పినోజ్ పిజ్జా’ కిచెన్ చూసి షాకైన అధికారులు!
-
FIFA Worldcup 2026లో కొత్త చరిత్ర.. ఒక్క రోజులోనే రికార్డు స్థాయి ప్రేక్షకులు.!
-
Noam Shazeer: గూగుల్‌కు బిగ్ షాక్.. జెమిని ఏఐ కీలక రూపశిల్పి రాజీనామా.. ఓపెన్ AI గూటికి టెక్ జీనియస్!
ట్రెండింగ్
-
Shubman Gill: డబుల్ సెంచరీపై కన్నేశా కానీ.. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్‌తో రోజంతా ఫ్రెష్‌గా!
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!