NTV Telugu Site icon

Pawan Kalyan: నేను చనిపోవడానికి సిద్ధపడి రాజకీయాలు చేస్తున్నా..

Pawan Kalyan Vararhi

Pawan Kalyan Vararhi

Pawan Kalyan Sensational Comments In Eluru Varahi Yatra Event: ఏలూరులోని పాత బస్టాండ్ వద్ద తన వారాహి యాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో జనసేనాధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చనిపోవడానికి సిద్ధపడి రాజకీయాలు చేస్తున్నానని కుండబద్దలు కొట్టారు. మరోసారి తనని ఓడించినా సరే, జనసేన పోరాటం మాత్రం ఆగదని తేల్చి చెప్పారు. తన వెంట లక్షమంది వస్తారని కాదని, తాను ఒక్కడినే నిలబడతానని ఉద్ఘాటించారు. వైసీపీ, జగన్ అరాచకాలను ఆపాలంటే.. రాష్ట్రంలో ప్రభుత్వం మారాల్సిందేనని వ్యాఖ్యానించారు. మాట్లాడితే తాను హైదరాబాద్‌లో ఉంటానని చెప్తారని, మీలాగే దోచేసిన డబ్బు తన దగ్గర లేదని పేర్కొన్నారు. తాను కష్టపడి సంపాదించిన డబ్బులను కౌలు రైతులు ఇస్తున్నానని చెప్పారు.

Anupama Parameswran : ఆ సినిమాలో నటించే ఛాన్స్ మిస్ అయినందుకు ఎంతో బాధ పడ్డాను..

సీఎం జగన్ బయటికొస్తే.. మహారాణిలా పరదాలు కట్టించుకొని తిరుగుతారని పవన్ ఆరోపించారు. ఏ ప్రభుత్వమైనా పారదర్శకత ఉండాలన్నారు. దేశంలో టిక్‌టాక్ బ్యాన్ చేస్తే, చైనాలో ఫేస్‌బుక్ బ్యాన్ చేశారని.. కానీ జగన్ మాత్రం ఇక్కడ జీవోలు కనబడకుండా చేశారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతీ మూడు రోడ్డు ప్రమాదాల్లో ఒకరు చనిపోతున్నారని.. రోడ్లు సరిగ్గా వేయకపోవడం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. చెత్త తొలగించే కార్మికులపై కూడా చెత్త ట్యాక్స్ వేసిన చెత్త సీఎం జగన్ అని విమర్శించారు. గెలుస్తావా? అని అందరూ తనని అడుగుతున్నారని.. గెలుస్తామా? లేదా? అనేది కాదని, పోరాటం చేయడమే లక్ష్యంగా తాను పని చేస్తానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 29వేల మంది ఆడపడుచులు కనిపించకుండా.. వీళ్లపై జగన్ ఒక్క రివ్యూ కూడా పెట్టలేదని మండిపడ్డారు.

Gold Smuggling: సూరత్ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ లో గోల్డ్ స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు..

వాలంటీర్స్ ఇచ్చే సమాచారం వల్ల రాష్ట్రంలో హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతోందని పవన్ సంచలన ఆరోపణలు గుప్పించారు. ఒంటరిగా ఉన్న మహిళల్ని టార్గెట్ చేసి, వారిని మానవ అక్రమ రవాణా చేస్తున్నారని అన్నారు. ఇందులో పెద్దల హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. వాలంటీర్లు ద్వారా ఏ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? ఏం చేస్తున్నారు? అనే సమాచారాల్ని రాబట్టి.. కొంతమంది వైసీపీ నేతలు హ్యుమన్ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలందరూ కోట్లలో దోచుకుంటున్నారన్నారు. మద్యపానాన్ని నిషేదం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్.. ఇప్పుడు మద్యం అమ్మి భారీస్థాయిలో డబ్బు సంపాదిస్తున్నారని వ్యాఖ్యానించారు. మద్యం ద్వారా దోచేసిన డబ్బులతో.. రేపు రాబోయే ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేస్తారని చెప్పుకొచ్చారు.

Girls Fighting : ఓరి నాయనో.. వీళ్ళు ఆడవాళ్లా.. రౌడీలా?

తనకు రాజకీయాలు ఏమాత్రం అవసరం లేదని, కేవలం ప్రజల కోసమే వచ్చానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వైసీపీ నేతలు తనని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు కట్టే పన్నులు సరిగా ఖర్చు చేస్తున్నారా? లేదా? అనేది కాగ్ చూస్తోందని.. 21-22 ఏపీ నివేదిక చూస్తే 25 లోపాలను ఎత్తి ఎత్తిచూపిందని గుర్తు చేశారు. స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, రోడ్ కార్పొరేషన్‌పై రూ.22 వేల కోట్లు అప్పు తీసుకొచ్చి.. ఎక్కడా లెక్కలో చూపలేదన్నారు. రూ.1800 కోట్ల వైఎస్ఆర్ పెన్షన్లు, రూ.390కోట్లు గర్భిణీలకు ఇవ్వాల్సిన మందులు ఇవ్వలేదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి డబ్బుల్ని సైతం దోచేశారని ఆరోపించారు.