ఈ నెల 11వ తేదీన పదవి విరమణ చేయనున్న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు శుభాకంక్షలు తెలియజేస్తూ ప్రశంసలు కురిపించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వెంకయ్యనాయుడు రాజకీయ మేధావి, ఏ పదవి చేపట్టినా వన్నె తెచ్చిన నాయకుడు అని ప్రశంసించారు.. విద్యార్థి దశలోనే రాజకీయాల్లో ప్రవేశించి, అత్యవసర పరిస్థితిని ఎదిరించారని పేర్కొన్న పవన్ కల్యాణ్.. ఆరు నెలలపాటు జైలు జీవితం మొదలుకుని ఇప్పటి ఉపరాష్ట్రపతి పదవి వరకు వెంకయ్యనాయుడు సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎన్నో మలుపులు, మరెన్నో అనుభూతులు ఉన్నాయన్నారు.. అయిదు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఏ పదవీ లేకుండా ఆయన ఎప్పుడూ లేరన్న పవన్.. ఇటు శాసనసభ, అటు రాజ్యసభల్లో ఆయన చేసిన ప్రసంగాలు ప్రతీ ఒక్కరిని ఆలోచింప చేశాయి. తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలపై వెంకయ్య నాయుడుకు ఉన్న పట్టు, వాగ్ధాటి ప్రతి ఒక్కరినీ సమ్మోహన పరుస్తాయన్నారు.. ఉప రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసి ప్రజలతో మమేకం కావటానికి సమాయత్తమవుతున్న తరుణంలో వెంకయ్య నాయుడుకు ఇవే మా హార్దిక శుభాకాంక్షలు అని తెలిపారు పవన్ కల్యాణ్.
Read Also: Godavari Floods: గోదావరి మళ్లీ ఉగ్రరూపం.. ఆరు జిల్లాలను అప్రమత్తం చేసిన ప్రభుత్వం..
కాగా, ఈ నెల 11న పదవి విరమణ చేయనున్నారు వెంకయ్యనాయుడు.. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఏర్పాటు చేసిన సత్కార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ప్రభుత్వ నిర్ణయాలను హర్షించే లక్షణం విపక్షాలకు ఉండాలని, ప్రతిపక్షాల వాదనలను గౌరవించే గుణం ప్రభుత్వ పక్షానికి కూడా ఉండాలని సూచించారు. ఉపరాష్ట్రపతి పదవి నుంచి తాను వైదొలగినప్పటికీ తాను ప్రజల్లో మమేకమై పని చేస్తానని వెల్లడించారు వెంకయ్యనాయుడు.. ఇక, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. వెంకయ్య నాయుడు స్ఫూర్తి ప్రదాత అని, ఆయన మార్గదర్శనంలో సుదీర్ఘకాలం సన్నిహితంగా పనిచేసే అవకాశం తనకు లభించడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. ధర్మం, కర్తవ్య నిర్వహణే లక్ష్యంగా ఆయన తన భావితరాలకు మార్గదర్శనం చేశారని వెంకయ్యపై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.
Pawan Kalyan Latest Tweet
రాజకీయ మేధావి శ్రీ @MVenkaiahNaidu గారు – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/6Kr877xNXL
— JanaSena Party (@JanaSenaParty) August 9, 2022
