NTV Telugu Site icon

Pawan Kalyan on Davos: దావోస్ లో జగన్ చెబుతున్నవి నిజాలేనా?

Pspk

Pspk

ఏపీ సీఎం జగన్ దావోస్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. దావోస్ వేదికగా జగన్ రెడ్డి చెబుతున్నవన్నీ నిజాలేనా..? అని ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అంబులెన్సులు ఉండవు… సెక్యూరిటీ గార్డు, స్వీపర్లు కుట్లు వేసి కట్లు కడతారని చెప్పాల్సింది. కోవిడ్ కాలంలో కేంద్రం ఇచ్చిన నిధులు ఎటుపోయాయి? వైసీపీ ఆర్థిక అరాచకం వల్లే విదేశీ పెట్టుబడులు రావడం లేదన్నారు పవన్.

ఏపీలో వైద్యారోగ్య రంగం వెలిగిపోతోందంటూ దావోస్ వేదికగా జగన్ చెప్పిన మాటలను ప్రజలు విశ్వసించడం లేదు. విదేశీయులకు ఏం చెప్పినా నిజాలు తెలియవనే ధీమాతో సీఎం మాట్లాడారు. కరోనా విపత్కర సమయంలో ఆక్సిజన్ కూడా అందించలేకపోయారు. ప్రాణవాయువు అందకే తిరుపతి రుయా ఆసుపత్రిలో 30మంది చనిపోయారనేది వాస్తవం. ఫస్ట్ వేవ్ కరోనా సమయంలో ఆసుపత్రులకు కనీసం మాస్కులు, గ్లౌజులు కూడా ఇవ్వలేకపోయారు.

ఆ విషయం గురించి ప్రశ్నించినందుకే .డా.సుధాకరును వేధించి, కేసులుపెట్టి, నడిరోడ్డుపై ఎలా బాధపెట్టారో ఒకసారి గుర్తు చేసుకోవాలి. అంబులెన్సులు ఉండవు, ఆస్పత్రిలో చనిపోతే కనీసం మృతదేహాన్ని తరలించే వాహనం ఇవ్వరు. ఇక వైసీపీ ప్రభుత్వం చేస్తున్న వైద్య ఆరోగ్య సేవలు ఏమిటి? రుయా ఆసుపత్రిలో పసిబిడ్డ మృతదేహాన్ని ఓ పేద తండ్రి బైక్ మీద తీసుకువెళ్లిన ఘటనలను మరిచారా..? ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రిలో సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు కుట్లు వేసి, కట్లు కట్టిన సంగతినీ కూడా దావోస్ వేదికగా చెప్పాల్సింది.

రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.1500 కోట్లు నిధులు కరోనాను ఎదుర్కొనేందుకే ప్రత్యేకంగా ఇచ్చింది.వాటిని ఏం చేశారు? కరోనా సమయంలో ఎంతోమంది స్పందించి విరాళాలు ఇచ్చారు. 2020, 2021ల్లో ఆసుపత్రులకు భోజనం సరఫరా చేసినవారికి బిల్లులు కూడా ఇవ్వలేదనేది వాస్తవం.రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రులకు మందులు, ఉపకరణాలు సరఫరాకు ఎన్నిసార్లు టెండర్లు పిలిచినా ఎందుకు రావడం లేదో కూడా జగన్ దావోస్ వేదికగా వివరిస్తే బాగుండేది. కరోనా మృతుల కుటుంబాలకు ఇవ్వాల్సిన ఆర్థిక సాయం రూ.11 వందల కోట్లను మళ్లించేశారు. ఇలాంటి నిజాలు ప్రజలకు తెలుసునన్నారు పవన్ కళ్యాణ్.

LIVE: కోనసీమ అమలాపురంలో టెన్షన్.. టెన్షన్

Show comments