Site icon NTV Telugu

Pawan Kalyan: అడవి బిడ్డలకు విద్య, వైద్యం అందుబాటులో ఉండాలి

Pawan Kalyan On Tribals

Pawan Kalyan On Tribals

Pawan Kalyan Interesting Comments On Tribal People: అడవి బిడ్డలకు విద్య, వైద్యం అందుబాటులో ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అడవి తల్లిని నమ్ముకున్న బిడ్డలు, కల్లాకపటం ఎరుగని మనుషులు మన గిరిజనులని.. కొండకోనల్లో నివసిస్తూ సంప్రదాయాలను బతికించుకొంటున్నారని వ్యాఖ్యానించారు. నేడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆదివాసీ దినోత్సవం సందర్భంగా.. గిరిపుత్రులకు ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. అటవీ ప్రాంతంలో అనువైన పంటలు పండించుకుంటూ.. చెట్టు చేమలు, సకల జీవాలను దైవసమానంగా చూసుకొనే జీవవైవిధ్య పరిరక్షకులని వారిని కొనియాడారు. గిరిజనుల జీవితాలు నిత్యం సవాళ్లతో కూడుకున్నవేనని.. విద్య, వైద్యం, శుభ్రమైన తాగునీరు వీరికి ఇప్పటికీ గగన కుసుమాలేనని ఆవేదన వ్యక్తం చేశారు.

Brazil: ఫ్లైట్ నడిపిన 11 ఏళ్ల బాలుడు.. మందుకొట్టిన తండ్రి.. ఇద్దరు మృతి

కొండకోనలు దాటి రావడానికి ఇష్టపడని ఈ అడవి బిడ్డలకు అనారోగ్యం చేసినా, ప్రసవానికి ఆస్పత్రికి వెళ్ళాలన్నా ఆ బాధలు వర్ణనాతీతమని పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయ్యారు. మంచానికి కర్రలుకట్టి వాగులు వంకలు దాటుకుంటూ ప్రయాసతో వారు ఆస్పత్రులకు వెళ్ళడం మనం ప్రసార మాధ్యమాలలో చూస్తూనే ఉన్నామన్నారు. ఆ దృశ్యాలు చూస్తే గుండె బరువైపోతుంటుందని.. ఈ పరిస్థితి మారాలని కోరారు. ఎంత వ్యయమైనా వారిని ఈ దుస్థితి నుంచి బయటపడేయాలని అన్నారు. గిరిజనుల బాగుకోసం ఏర్పాటు చేసిన ఐటీడీఏ సంబంధిత విభాగాల్లో సేవా భావం కలిగిన వారిని నియమించి, ఆ వ్యవస్థను పటిష్టపరచాలని డిమాండ్ చేశారు. అత్యవసర ఆరోగ్య సమయాల్లో అడవిబిడ్డల కోసం ఎయిర్ అంబులెన్సుల ఏర్పాటుపై కార్యాచరణ చేయాలన్నారు.

Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?

ఆరు కిలోమీటర్ల పర్యటనకు హెలికాప్టర్ ఉపయోగిస్తున్నప్పుడు.. ఒక ప్రాణాన్ని కాపాడడానికి హెలికాప్టర్‌ను ఉపయోగించడం భారమైన పని కాదని పరోక్షంగా సీఎం జగన్‌పై పవన్ కళ్యాణ్ కౌంటర్ వేశారు. అదే విధంగా గిరిజన బాలబాలికలకు విద్య అందుబాటులో ఉంచాలన్నారు. గిరిపుత్రులు వారు కోరుకున్న జీవితాన్ని కొనసాగించడానికి కావలసిన కనీస అవసరాలను ఏర్పాటు చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని సూచించారు. గిరిజన లోకంలో చైతన్యం వెల్లివిరియాలని, వారు సుఖశాంతులతో జీవించాలని పవన్ కళ్యాణ్ కోరుకున్నారు.

Exit mobile version