NTV Telugu Site icon

Pawan Kalyan bus yatra: పవన్‌ ప్రత్యేక బస్సుకు తుది మెరుగులు.. పరిశీలించిన జనసేనాని..

Pawan Kalyan Bus Yatra

Pawan Kalyan Bus Yatra

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ త్వరలోనే యాత్ర చేపట్టబోతున్నారు.. పవన్ బస్సు యాత్రకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. పవన్ కోసం ప్రత్యేకంగా బస్సు తయారైంది.. దీనికి తుది మెరుగులు దిద్దుతున్నారు.. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా తయారు చేస్తున్న ఈ బస్సు.. ఎన్టీఆర్ చైతన్య రధాన్ని పోలి ఉంది. ఇప్పటి వరకూ బస్సు యాత్ర చేసిన వివిధ పార్టీలు నేతలు వాడిన బస్సులకు భిన్నంగా ఈ బస్సును డిజైన్ చేశారు. రెగ్యులర్ బస్సులు, లారీలకు వాడే పెద్ద టైర్లు దీనికి వాడారు. వర్క్ షాపులో తయారు అవుతున్న ఈ బస్సుకు సంబంధించిన ఫొటోలు ఇప్పటికే బయటకు వచ్చి.. సోషల్‌ మీడియాలో రచ్చ చేశాయి.. అయితే.. ఈ ప్రత్యేక బస్సు హంగులు తుది దశకు చేరుకున్నాయి.. ఈ నేపథ్యంలో ఇవాళ ఆ ప్రత్యేక వాహనాన్ని పరిశీలించారు జనసేనాని.. బస్సును పరిశీలించి.. కొన్ని సూచనలు చేసినట్టుగా తెలుస్తోంది.

Read Also: Pawan Kalyan Vizag Tour: జనసేనాని విశాఖ టూర్‌ షెడ్యూల్‌ ఇదే.. ‘విశాఖ గర్జన’తో టెన్షన్‌..!

ఇక, ఈ బస్సుకు ప్రత్యేకంగా సౌండ్ సిస్టం ఏర్పాటు చేస్తున్నారు.. అంతేకాదు.. ఎంత దూరంలో ఉన్న.. వారికి పవన్ కల్యాణ్‌ కనిపించేలా బస్ టాప్‌ ఏర్పాటు చేస్తున్నారు.. ఆ యాత్ర జరిగినన్ని రోజులు పవన్ కల్యాణ్‌ అందులోనే ఉండనున్న నేపథ్యంలో.. ఆయన అలవాట్లు, అవసరాలకు తగ్గట్టుగా అందులో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు.. అయితే, మొదట అక్టోబర్‌ మొదటివారం నుంచే ఆ యాత్ర ప్రారంభించాలని భావించారు.. కానీ, బస్సు యాత్ర వాయిదా వేస్తున్నట్లు ఈ మధ్యే పవన్‌ ప్రకటించారు. అయితే, నియోజకవర్గాలవారీగా సమీక్షలు నిర్వహించనున్నట్లు జనసేనాని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 45-67 సీట్లే రాబోతున్నాయని, జనవాణిలో వచ్చిన ఆర్జీలను కూడా ఆధ్యయనం చేస్తున్నామన్నారు. సమస్యలపై అధ్యయనం జరుగుతుందని.. అధ్యయనం పూర్తయ్యాక బస్సు యాత్ర ఉంటుందని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేసిన విషయం తెలిసిందే..

Whatsapp Image 2022 10 12 At 7.27.47 Pm