Site icon NTV Telugu

Pawan Kalyan: అన్నమయ్య డ్యాం బాధితులకు పవన్ కళ్యాణ్ ఆర్ధిక సహాయం

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: అమరావతిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను అన్నమయ్య డ్యామ్ బాధితులు కలిశారు. ఈ సందర్భంగా లష్కర్ రామయ్యకు పవన్ కళ్యాణ్ రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. అన్నమయ్య డ్యామ్ బాధిత యువకుడు వంశీకి రూ.50 వేలు ఆర్ధిక సాయం అందించారు. అనంతరం జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిందని ఆరోపించారు. ఈ అంశంపై జనసేన పార్టీ ముందుగా స్పందించిందని గుర్తుచేశారు. సీఎం సొంత జిల్లాలో ఈ ఘటన జరిగినా ప్రభుత్వం కనీసం స్పందించలేదని నాదెండ్ల మనోహర్ విమర్శించారు.

Read Also: Ex Minister Nani Counter to Pawan Kalyan live: పవన్ కళ్యాణ్ కి పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్

అన్నమయ్య డ్యాం బాధితులకు మూడు నెలల్లో ఇళ్లు కట్టిస్తామని.. రూ. 5 లక్షలు పరిహారం ఇస్తామని ఆనాడు వైసీపీ ప్రభుత్వం చెప్పిందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గుర్తుచేశారు. కానీ ఏడాది పూర్తయినా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆరోపించారు. అన్నమయ్య డ్యామ్ వద్ద లష్కరుగా ఉన్న రామయ్య అధికారులను, ప్రజలను అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారని తెలిపారు. వందలాది మంది ప్రజల ప్రాణాలను లష్కర్ రామయ్య కాపాడారని కొనియాడారు. రామయ్య ఫోన్లు చేయడం వల్లే చాలా మంది ప్రాణాలు కాపాడుకోగలిగారని చెప్పారు. రామయ్య ఇల్లు కూడా వరదలకు కొట్టుకుపోయిందని నాదెండ్ల మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి రామయ్యని సత్కరించడం జనసేన బాధ్యతగా భావిస్తోందని తెలిపారు. ప్రభుత్వం రూ.కోటి కేటాయించి ఉండుంటే.. అన్నమయ్య డ్యామ్ రిపేర్ పనులు పూర్తయ్యేవి అని.. కానీ ప్రభుత్వం అలా చేయలేదని చురకలు అంటించారు.

Read Also: Ram Charan: వాలెంటైన్స్ డేకి మెగా పవర్ స్టార్ సినిమా రిలీజ్ అవుతుందా?

Exit mobile version