Pawan Kalyan: వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీది దేశీయ దొరతనం అంటూ విమర్శలు గుప్పించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బ్రిటీష్ వాళ్లు వెళ్లిపోయివా దేశంలో ఇంకా దొరతనం పోలేదు.. దేశం ఏ ఒక్క కులమో.. సజ్జలో.. వైసీపీ సొంతమో కాదు.. ఇది ప్రజాస్వామ్యం.. కులస్వామ్యం కాదు అని హితవుపలికారు.. జనసేన పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన తర్వాత జనసేన శ్రేణులను ఉద్దేశించి మాట్లాడిన పవన్… ఇవాళ మా పబ్బం గడుపుకునే ఐడియాలజీ నేను మాట్లాడను.. రెండు తరాలకు మేలు జరిగే ఐడీయాలజీ గురించే నేను మాట్లాడతాను అన్నారు.. ఓ రోజు లెఫ్ట్.. మరోసారి బీజేపీతో ఉంటారని నన్ను విమర్శలు చేస్తున్నారు.. రెండింటికీ మధ్యస్థమైన ఐడీయాలజీతో ఉన్నాను.. నేను మానవతావాదిని.. మధ్య దారిలో ఉన్న నేను ప్రజల అవసరాల కోసం మారుతూ ఉంటానని స్పష్టం చేశారు.. కులాల మధ్య ఐక్యత సాధించే వాడే నాయకుడు… ఓ చేయి సొంత కులం వైపు.. మరో చేయి వేరే కులాల వైపు ఉండాలని.. లేకుంటే మిగిలిన కులాలకు దూరమవుతారని తెలిపారు పవన్..
Read Also: Hero Sharwanand: గ్రాండ్ గా హీరో శర్వానంద్ నిశ్చితార్థం
ఇక, సనాతన ధర్మం ప్రకారం పూజలు చేస్తే.. నన్ను ప్రశ్నిస్తున్నారు.. ఓ ముస్లింనో.. క్రిస్టియన్నో నన్ను విమర్శించినట్టు.. ప్రశ్నించినట్టు విమర్శించగలరా..? అని ప్రశ్నించారు పవన్.. హిందూ దేవుళ్లను దూషణ చేయొద్దు.. ఇటీవల కాలంలో దేవుళ్లపై దూషణలు ఎక్కువ అవుతున్నాయన్న ఆయన.. దేవతా దూషణల వల్ల బ్రహ్మాణ కులాలకే కాదు.. సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి హిందువును బాధ పెడుతోందన్నారు. మహ్మద్ ప్రవక్తనో.. జీసస్ నో దూషించగలరా..? నేను ఇలా మాట్లాడతున్నానని రైట్ వింగ్ అనుకోవద్దు.. అనుకున్నా సంతోషమే అన్నారు.. హేతువాదం అనే పేరు మీద హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారని విమర్శించారు.. పార్టీ నిర్మాణం అంటే చాలా కష్టం.. చాలా మంది సలహాలిస్తున్నారు. నా తాత, నాన్న సీఎంలు కాదు. పార్టీ నిర్మాణం జరగాలంటే దశాబ్ద కాలం పాటు వేచి చూడాలన్నారు.. పాలు తోడు పెడితే ఉదయానికి పెరుగు అవుతుంది.. ప్రతి పది నిమిషాలకోసారి చూస్తూ పెరగు అవలేదంటే ఎలా..? ఏపీకి రాజకీయ స్థిరత్వం కావాలి.. లేకుంటే అభివృద్ధి పక్క రాష్ట్రాలకు వెళ్తుందన్నారు పవన్ కల్యాణ్.
ఇవాళ దేశం కోసం త్యాగాలు చేసిన మహానుభావులను స్మరించుకోవాలి.. మతప్రతిపాదికన దేశ విభజన జరిగింది.. అహింసతో స్వాతంత్ర్యం వచ్చింది.. కానీ.. ఆ తర్వాత విపరీతమైన హింస జరిగిందన్నారు పవన్ కల్యాణ్.. మహనీయుల త్యాగ ఫలంతో మన జీవితం ఉందన్న ఆయన.. ఇదే సమయంలో పద్మ అవార్డులు అందుకున్న వారికి అభినందనలు తెలిపారు.. తెలుగు వారికి ఈ స్థాయిలో పద్మ అవార్డులు రావడం సంతోషంగా ఉంది.. సమాజానికి ఎన్నో సేవలందించిన వారిని గౌరవించుకోవాలన్నారు.. తెలుగు అన్ సంగ్ హీరోలకు పద్మ అవార్డులిచ్చిన కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు.. బిడ్డల భవిష్యత్తును పణంగా పెట్టి.. పార్టీ ప్రారంభించాను. వారాహి ఎలా రోడ్ల మీదకు వస్తుందో చూస్తామంటున్నారు.. నేను చట్టాలను గౌరవించేవాడిని.. కోడి కత్తితో పోడిపించుకుని డ్రామాలాడేవాడిని కాను అని వ్యాఖ్యానించారు.. డబ్బులు దోచుకుని.. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టించే మీకే అంతుంటే.. ఏ తప్పు చేయని నాకెంత ఉండాలన్న ఆయన.. నేను దుర్గమ్మ భక్తుడిని.. కానీ, ఎప్పుడూ టెంపులుకు వెళ్లలేదన్నారు.. కానీ, వారాహి ప్రారంభించాక.. వెళ్లాను.. దుర్గమ్మ ఆశీస్సులు తీసుకున్నాను అన్నారు.. ర్యాలీ చేయాలని అనుకోలేదు.. కానీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని తెలిపారు పవన్ కల్యాణ్.