NTV Telugu Site icon

Pawan Kalyan Delhi Tour: ఢిల్లీలో జనసేనాని.. ఇద్దరు కీలక నేతలతో భేటీ..!

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan Delhi Tour: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఢిల్లీ బాట పట్టారు.. ఇప్పటికే హస్తిన చేరుకున్న ఆయన.. భారతీయ జనతా పార్టీలో కీలకంగా ఉన్న నేతలను కలవబోతున్నారు.. ప్రతిపక్షాలపై అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ దాడులను కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని ఇటీవల ప్రకటించిన పవన్‌.. ఇప్పుడు అందుకే ఢిల్లీ వెళ్లారా? అనే చర్చ సాగుతోంది.. అయితే, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఈ మధ్య హస్తిన వెళ్లివచ్చారు.. తన పర్యటనలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశం అయ్యారు.. దీంతో.. జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత పవన్‌ కల్యాణ్‌ ఢిల్లీ టూర్ పై ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.

Read Also: Twitter Blue Tick: మస్క్‌ కీలక నిర్ణయం.. వారికి ఫ్రీగా ట్విట్టర్‌ బ్లూటిక్‌.. వీరికి మాత్రం షాక్..!

ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అపాయింట్‌మెంట్‌ పవన్‌ కల్యాణ్‌కు ఖరారు అయినట్టు తెలుస్తోంది.. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. ఆ ఇద్దరు కీలక నేతలతో సమావేశం కానున్నారు.. పవన్ ఢిల్లీ టూర్ తో మరోసారి రోడ్ మ్యాప్ ఎపిసోడ్ తెరపైకి వచ్చింది.. తెలంగాణ రాజకీయాలపైనా ఢిల్లీ పెద్దలతో చర్చించే అవకాశం ఉందని జనసేన వర్గాలు చెబుతున్నాయి.. పవన్‌ వెంట ఢిల్లీ వెళ్లారు జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌.. కాగా, బీజేపీ, జనసేన పొత్తుపై పలు సందర్భాల్లో క్లారిటీ ఇచ్చారు పవన్‌ కల్యాణ్‌.. బీజేపీతో పొత్తులో ఉన్నామన్న ఆయన.. ఈ మధ్య టీడీపీకి కూడా అనుకూలంగా ఉన్నామనే సంకేతాలు ఇచ్చారు. మరోవైపు, ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత జనసేనతో పొత్తు ఉన్నా లేనట్టేనని.. పవన్‌ కల్యాణ్ నుంచి సరైన సహకారం అందలేదంటూ ఏపీ బీజేపీలో కీలక నేతలు వ్యాఖ్యానించడం పెద్ద దుమారమే రేపింది.. ఇలాంటి సమయంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది.