NTV Telugu Site icon

Pawan Kalyan: రిజర్వేషన్ల పేరుతో రాజకీయం చేసే వాళ్లకు బుద్ధి చెప్పాలి

Pawan

Pawan

Pawan Kalyan: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీయే కూటమి అభ్యర్థులకు మద్దతుగా నాందేడ్ జిల్లా పాలజ్ లలో నిర్వహించిన బహిరంగ సభలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలజ్ గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. బోకర్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి జయ చౌహాన్ ని, సంతుక్రవ్ అంబార్డేని గెలిపించాలని కోరారు. మన ఆశయాలు నెరవేర్చాలంటే ఎన్డీయే కూటమితోనే సాధ్యమని చెప్పుకొచ్చారు.

Read Also: Tilak Varma: పుష్ప-3లో ఛాన్స్ వస్తే ఏం చేస్తానంటే..?

అలాగే, ఛత్రపతి శివాజీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పుట్టిన గడ్డపై అడుగు పెట్టడం ఆనందంగా ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఎన్డీయే పాలనలో గత 10 సంవత్సరాలుగా సుఖన్య సమృద్ధి యోజన, పీఎం కిసాన్ లాంటి ఎన్నో పథకాలు, రోడ్లు, భవనాలు లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాలనలో దేశం అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతుందన్నారు.

Read Also: Minister Kandula Durgesh: తెలుగు భాషను కాపాడుకుందాం.. మన సాంస్కృతిక వైభవాన్ని నిలబెడతాం

ఇక, మహారాష్ట్రలో రిజర్వేషన్ల పేరుతో రాజకీయం చేసే వాళ్లు ప్రజలను విడగొట్టి బలహీన పరచాలని చూస్తున్నారని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోపించారు. కాగా, నిర్మల్ జిల్లా ముధోల్ తాలూకా కుబీర్ మండలానికి మూడు కిలో మీటర్ల దూరంలోని పాలజ్ గ్రామంలో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభకి భారీగా తెలుగు అభిమానులు హాజరయ్యారు.

Show comments