Site icon NTV Telugu

Pawan Kalyan: బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్ధి పవన్ కాదా?

Pawank

Pawank

ఏపీలో ఇంకా ఎన్నికలు టైం వుంది. కానీ ప్రధాన ప్రతిపక్షం మాత్రం ముందస్తు ముహూర్తాలు పెట్టేస్తోంది. వైసీపీ నేతలు కూడా ముందస్తు మాట ఎత్తకుండానే ఎన్నికల కోసం సమాయత్తం అవుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. 2024 కి కంటే ముందు ఎన్నికలు జరిగినా. జరగకపోయినా ఏపీలో మాత్రం పొత్తులు వుంటాయనేది జగమెరిగిన సత్యం. బీజేపీ-జనసేన కలిసి నడుస్తాయని బీజేపీ నేతలే ఎక్కువగా ప్రకటిస్తున్నారు.

తాజాగా అమరావతిలో జనసేనాని పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన-బీజేపీ ఉమ్మడి సీఎం అభ్యర్థిగా నన్ను ప్రకటిస్తారనేది గాల్లో మాటలు నేను దానికి స్పందించను. నాకు ఢిల్లీ నేతలతోనే సంబంధాలు.. రాష్ట్రంలోని బీజేపీ నేతలతో నాకు అంతగా పరిచయం లేదన్నారు. 2007 నుంచి ఢిల్లీ బీజేపీ నేతలతో పరిచయాలున్నాయి. 2014 తర్వాత సోము వీర్రాజును తొలిసారిగా కలిశాను. ఏపీకి వచ్చే నడ్డాతో భేటీ కావడం లేదు. నా షెడ్యూల్.. ఆయన షెడ్యూల్ వేర్వేరుగా ఉన్నాయన్నారు.

గోదావరి గర్జన నిర్వహణ బీజేపీ నిర్ణయం.. ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయం. మహానాడు సక్సెస్ అయిందంటున్నారా..? మంచిదే అన్నారు పవన్. వైసీపీ పాలన బాగుంటే పొత్తుల ప్రస్తావన ఎందుకొస్తుంది..? అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీ వైసీపీయే…కానీ యువజనులకు ఉపాధి-ఉద్యోగాలు లేవు. శ్రామికులనూ నానా ఇబ్బందులు పెడుతున్నారు.. పనులు దొరకని పరిస్థితి. రైతులకి గిట్టుబాటు ధర లేదు. తన పార్టీ పేరులో ఉన్న వాళ్లకే న్యాయం వైఎస్సార్సీపీ న్యాయం చేయలేకపోతోందని విమర్శించారు.

ఉద్రిక్తతలు తగ్గాక.. కోనసీమలో పర్యటిస్తానన్నారు పవన్ కళ్యాణ్. వైసీపీ వాళ్లు అందర్నీ కొడతారు.. ఓ ఆర్డీవో అనో.. ఏఈ అనో కాదు.. అందర్నీ కొడతారు. కొట్టడం తమ హక్కుగా వైసీపీ నేతలు భావిస్తున్నారు. వైసీపీ ఉన్నంత వరకు పోలవరం పూర్తి కాదు. ఎవరి హయాంలో డయాఫ్రం వాల్ దెబ్బతిందనేది ఇరిగేషన్ నిపుణులే చెప్పాలి. కొన్ని కులాలను వైసీపీ తమ వర్గ శత్రువులుగా భావిస్తోంది. కమ్మ, కాపు, మత్స్యకార, బీసీ కులాలను వైసీపీ వర్గ శత్రువుగా భావిస్తోంది. ఇది సమాజానికి మంచిది కాదని కామెంట్లు చేశారు పవన్.

మరి బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి పవన్ కళ్యాణ్ కాకుంటే ఇంకెవ్వరు అనేది రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక అవుతోంది. రెండు పార్టీలు అంగీకరించే అభ్యర్థి విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే వుంది.ఎన్నికలకు వెళ్ళడానికి ఇంకా సమయం వుండడంతో రెండు పార్టీలు ఎలా ముందుకెళతాయో చూడాలి.

Raghunandan Rao: ఆమ్నేషియా పబ్ కేసులో హోంమంత్రి మనవడే ప్రధాన సూత్రధారి

Exit mobile version