Pawan Kalyan: నాకు పదవి ముఖ్యం కాదు.. పదవి కావాలంటే ఎప్పుడో ఎంపీ అయ్యేవాడిని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan Key Comments in independence day Celebrations: పదవులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు పదవులు ముఖ్యం కాదని పవన్ స్పష్టం చేశారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ.. తాను పదవే కావాలని కోరుకుంటే 2009లోనే ఎంపీని అయ్యేవాడినని వ్యాఖ్యానించారు. మరోవైపు సీఎం జగన్‌పై పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలపై తాను ప్రశ్నిస్తుంటే.. సీఎం జగన్ తనకు కులం రంగు పులుముతున్నారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని వైసీపీ సర్కారు దుర్వినియోగం చేస్తోందని పవన్ ఆరోపించారు. ఇష్టానుసారం మాట్లాడే వైసీపీ నేతలకు తాను జవాబు చెప్పగలనని పవన్ అన్నారు. వైసీపీ ఎంపీలు ఢిల్లీకి వెళ్లి ఏం చేస్తారనే విషయం తనకు తెలుసు అని.. ప్రధాని ముందు వైసీపీ ఎంపీలు కనీసం నోరు కూడా మెదపలేరని ఎద్దేవా చేశారు.
Read Also: ఆగండి.. బాత్రూమ్ కి ఫోన్ తీసుకెళ్తున్నారా?
Also Read
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
- Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
- AP Weather Update : ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాలు, వడగాల్పుల డబుల్ అలర్ట్.!
అటు పార్టీని నడిపేందుకు వైసీపీ నేతలకే అర్హత ఉందా తమకు లేదా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధులు, పోలీసులు, అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని.. కానీ ప్రస్తుతం ఏపీలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని పవన్ విమర్శలు చేశారు. జనసేన అధికారంలోకి వస్తేనే వ్యవస్థలు బలోపేతం అవుతాయని పవన్ అన్నారు. ప్రజలు మౌనంగా ఉంటే వ్యవస్థలు బలంగా మారలేవని అభిప్రాయపడ్డారు. అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని వైసీపీ నేతలు ఎలా చెప్తారని పవన్ నిలదీశారు. గుడివాడలో ఇసుక దందా, చిత్తూరు జిల్లాలో తమ పార్టీ నేతలపై ప్రభుత్వం అన్యాయంగా కేసులు బనాయిస్తోందని పవన్ ఆరోపించారు. జనసేన అధికారంలోకి వస్తే అందరి లెక్కలు తేలుస్తామన్నారు. భీమ్లా నాయక్ అనే సినిమా ఆపడానికి ఎమ్మార్వో నుంచి చీఫ్ సెక్రెటరీ దాకా అందరూ పనిచేశారని పవన్ చురకలు అంటించారు. తాను కేసులకు భయపడే వ్యక్తిని కాదని ఆయన స్పష్టం చేశారు.
ఎంపీలు, మంత్రులు ఢిల్లీ వెళ్లి ఏం మాట్లాడతారో నాకు తెలుసు
వాళ్ల వేషాలు మన దగ్గరే. – JanaSena Chief Sri @PawanKalyan pic.twitter.com/02WrbOHoCo— JanaSena Party (@JanaSenaParty) August 15, 2022
తాజావార్తలు
-
Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
-
Shreyas Iyer: కేక్‌పై ఐసింగ్ లాంటిది.. టీమిండియా కెప్టెన్సీపై తొలిసారి స్పందించిన శ్రేయస్ అయ్యర్!
-
Sriram Krishnan: ట్రంప్ ప్రభుత్వానికి షాక్.. AI విధాన సలహాదారు పదవికి శ్రీరామ్ కృష్ణన్ రాజీనామా
-
Drishyam 3 Hindi Version : ‘దృశ్యం 3’ హిందీ వెర్షన్ లో భారీ మార్పులు… రీజన్ ఇదేనా ?
-
Odisha Engineer: రూ.6 వేల జీతంతో ప్రారంభం.. రూ.2 కోట్ల ఆస్తులతో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!