Palnadu: నరసరావుపేటలో బిల్డింగ్పై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య

  • పల్నాడు జిల్లా నరసరావుపేటలో తీవ్ర విషాదం..
  • భవనంపై నుంచి దూకి సూసైడ్ చేసుకున్న ఇంటర్ విద్యార్థి..
  • ఘటనపై విచారణ చేస్తున్న నరసరావుపేట పోలీసులు..
Palnadu

Palnadu

Palnadu: పల్నాడు జిల్లా నరసరావుపేటలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్నేహితురాలితో ఏర్పడిన స్వల్ప వివాదంతో ఓ స్టూడెంట్ భవనంపై నుంచి దూకి సూసైడ్ చేసుకుంది. బొల్లాపల్లి మండలం వెల్లటూరుకు చెందిన జెట్టి అనూష నరసరావుపేటలోని ప్రైవేటు కాలేజ్ హాస్టల్‌లో ఉంటూ ఇంటర్‌ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఈరోజు (శనివారం) ఉదయం హాస్టల్‌లో ఉన్న టైంలో ఆమె స్నేహితురాలితో ఏదో విషయంలో స్వల్ప వివాదం జరగడంతో.. మనస్తాపానికి గురైన అనూష హాస్టల్‌ భవనంలోని నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకేసింది.

Read Also: Pushpa 2: రేయ్ బాబూ, ట్రైలర్ రేపు.. అప్పుడే వచ్చేశారు ఏంటీ?

అయితే, హాస్టల్‌ సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే చనిపోయిందని వైద్యులు తెలిపారు. కాలేజ్ యాజమాన్యం ద్వారా విషయం తెలుసుకున్న నరసరావుపేట ఆర్డీవో హేమలత, ఎమ్మార్వో వేణుగోపాల్‌, నరసరావుపేట గ్రామీణ పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని దర్యాపు చేస్తున్నారు. ఇక, విషయం తెలుసుకున్న విద్యార్థిని కుటుంబ సభ్యులు, బంధువులు కళాశాల హాస్టల్ దగ్గరకు చేరుకుని ఆందోళనకు దిగారు. విద్యార్థిని ఆత్మహత్యపై కళాశాల యాజమాన్యం సరైన సమాధానం చెప్పడం లేదంటున్నారు. అయితే, స్టూడెంట్ అనుష సూసైడ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.