Site icon NTV Telugu

Andhra Pradesh: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు అరెస్ట్..

Kishore

Kishore

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తురక కిషోర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తురక కిషర్‌ను ఏపీ పోలీసులు హైదరాబా‌ద్‌లో అదుపులోకి తీసుకున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం తురక కిషోర్ అజ్ఞాతంలోకి వెళ్లారు. అప్పటినుండి పోలీసుల కళ్ళు కప్పి తిరుగుతున్న కిషోర్‌ను.. పోలీసులు ఈరోజు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. మాచర్లలో టీడీపీ నేతలపై దాడితో సహా.. పలు కేసుల్లో తురక కిషోర్ నిందితుడిగా ఉన్నాడు.

Read Also: Bird flu: “బర్డ్ ఫ్లూ”‌తో 3 పులులు, ఒక చిరుత మృతి.. మహారాష్ట్రలో రెడ్ అలర్ట్..

తురక కిషోర్‌పై ప్రధాన ఆరోపణలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలలో టీడీపీ నేతలు బొండా ఉమా, బుద్ధ వెంకన్నలపై మాచర్ల పట్టణంలో దాడి చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. 2022 డిసెంబర్ 16న తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘ఇదేం కర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో టీడీపీ ఇంఛార్జి జూలకంటి బ్రహ్మానందరెడ్డిపై కిషోర్ దాడి చేశాడు. దాడి అనంతరం మాచర్ల పట్టణంలో వైసీపీ నాయకులను వెంటబెట్టుకొని టీడీపీ ఆస్తులను, పార్టీ కార్యాలయం వాహానాలను ధ్వంసం చేసిన ఘటనలలో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.

Read Also: Venkatrami Reddy: ఉద్యోగులకు ఐఆర్ ఇస్తామన్నారు.. ఇప్పటికి ఎలాంటి ప్రకటన లేదు

2024 మే నెలలో జరిగిన సాధారణ ఎన్నికలలో మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ రోజున పలు హింసకాండలో తురక కిషోర్‌ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. రెంటచింతల మండలం పాలువాయి గేటులో పోలింగ్ రోజు అక్కడ ఏజెంట్‌గా ఉన్న నంబూరు శేషగిరిరావుపై దాడి చేసి గాయపరిచిన సంఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అలాగే మాచర్ల పట్టణం పీడబ్ల్యుడి కాలనీలో టీడీపీ నేత ఎనుముల కేశవరెడ్డి ఇంటిపై విధ్వంసానికి పాల్పడి పలువురిని గాయపరిచిన సంఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. పోలింగ్ మరుసటి రోజు కారంపూడి పట్టణంలో సీఐ నారాయణస్వామి పై దాడి, టీడీపీ కార్యాలయం విధ్వంసం, తెలుగుదేశం నాయకుల వాహనాలు ధ్వంసం చేసిన కేసులో తురక కిషోర్‌ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.

Exit mobile version