Site icon NTV Telugu

CM Chandrababu: నేను వచ్చిన వెంటనే చెత్త తొలగించా.. చెత్త నేతలకు అదే గతి..! సీఎం సీరియస్‌ వార్నింగ్..

Babu 3

Babu 3

CM Chandrababu: నేను వచ్చిన వెంటనే చెత్త తొలగించా.. చెత్త నేతలను కూడా అలాగే తొలగిస్తాను అంటూ రౌడీషీటర్లకు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పల్నాడు జిల్లా మాచర్లలో పర్యటించిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. చాలా రోజుల తర్వాత మాచర్లలో టీడీపీ జెండా ఎగరేశారు జూలకంటి బ్రహ్మారెడ్డి, శ్రీకృష్ణదేవరాయలు అని గుర్తుచేశారు.. మాచర్లకు వచ్చిన నాకు ఘనస్వాగతం పలికారు. ఈ రోజు మాచర్లకు స్వాతంత్ర్యం వచ్చింది.. ఇది నిలబెట్టాల్సిన బాధ్యత మీదే అని సూచించారు.. మాచర్లలో ఉండే రౌడీలు, ముఠా నాయకులు ప్రజల ఆస్తులను దోచేశారు. చరిత్రలో ఉన్న డిక్టేటర్లకు పట్టిన గతే వారికి పట్టిందన్నారు.. ఆత్మకూరు బాధితులను ఆదుకునేందుకు కూడా నన్ను రానివ్వకుండా నా ఇంటికి తాళ్లు కట్టారు. ఆరోజే చెప్పా… మీకు ఉరితాళ్లే అని.. మున్సిపల్ ఎన్నికలలో దౌర్జన్యం చేసినప్పుడే చెప్పా ఖబడ్దార్ అని గుర్తుచేశారు.

Read Also: Bolarum Railway Staion : హైదరాబాద్ బోలారం స్టేషన్‌లో పట్టాలపై నడుస్తున్న ముగ్గురిని ఢీకొన్న రైలు

నేను 1995 ముఖ్యమంత్రిని.. స్వర్ణాంధ్ర-స్వఛ్చాంధ్ర కార్యక్రమానికి వచ్చా. మనసులో చెత్త ఉండే మనుషులను కూడా తీసెయ్యాలని పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు.. గత ప్రభుత్వం చెత్తను రోడ్లపై వేశారు… చెత్తపై పన్ను వేశారు. నేను వచ్చిన వెంటనే చెత్త తొలగించా.. చెత్త నాయకులను కూడా అలాగే చేస్తాను అని హెచ్చరించారు.. మాచర్లలో రికార్డు మెజారిటీ ఇచ్చారు. చంద్రయ్యను అత్యంత దారుణంగా హత్య చేశారు. ప్రాణాలు లెక్కచెయ్యకుండా జై తెలుగుదేశం అన్నారు. జల్లయ్యను కిరాతకంగా చంపారు. నంబూరు శేషగిరిరావు వీరోచితంగా పోరాడారు. కానీ, ఎవరికి అన్యాయం జరిగినా ఈ ప్రభుత్వం ఉపేక్షించదు అని స్పష్టం చేశారు.. నాలాంటి నాయకుడే మాచర్ల రసలేకపోయారంటే చిన్న నాయకుల పరిస్థితి ఏంటి..? అని ప్రశ్నించారు చంద్రబాబు..

ఇక, త్వరలో సంజీవని కార్యక్రమం తీసుకొస్తా.. అందరికీ రెండున్నర లక్షల ఇన్సూరెన్స్, పేదలకు 25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ అందుబాటులోకి తీసుకొస్తా అన్నారు సీఎం చంద్రబాబు.. మీ ఇంటి వద్దే మీ ఇంటికి వైద్యం అందేలా చేస్తా.. బిల్ గేట్స్ సాంకేతిక సాయం చేసేందుకు అంగీకరించారు. 2047కల్లా 50శాతం పచ్చదనం రాష్ట్రంలో ఉండేలా ప్రణాళికలు అమలు చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని పిలుపునిచ్చారు.. పల్నాడుపై నాకు ఎనలేని అభిమానం.. పల్నాడు జిల్లా తలసరి ఆదాయంలో తక్కువగా ఉంది.. మాచర్లలో మరింత తక్కువగా ఉంది. మాచర్లకు ప్రత్యేకంగా నిధులు ఇస్తాం. జల్ జీవన్ మిషన్ ద్వారా మాచర్ల గురజాల నియోజకవర్గాలలో ఇంటింటికీ నీరు ఇచ్చే బాధ్యత నాది. వరికపూడిసెల పల్నాడు జీవనాడి.. అరవై ఏళ్ల చిరకాల స్వప్నం.. వరికపూడిసెల పూర్తి చేసే బాధ్యత తీసుకుంటా.. వరికపూడిసెల ద్వారా లక్షా 25వేల ఎకరాలకు నీరందిస్తాం. 2027 కల్లా పోలవరం పూర్తిచేసి జాతికి అంకితం చేస్తా.. పక్కనే నాగార్జున సాగర్ ఉన్నా మాచర్లకు తాగునీరు అందదు.. నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రంలో అందరికీ సాగు, తాగునీరు అందిస్తాం. ఈ ఏడాది 94 శాతం ప్రాజెక్టులలో జలకళ కనిపిస్తుంది. కేంద్రంతో మాట్లాడి చిల్లీ బోర్డు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. వ్యవసాయంలో పురుగుమందుల వాడకం తగ్గించండి. యూరియా ఎక్కువగా ఉపయోగిస్తే పంట ఉత్పత్తులతో అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..

Exit mobile version