NTV Telugu Site icon

CM Chandrababu: గత ప్రభుత్వం వ్యవస్థ మొత్తాన్ని సర్వనాశనం చేసింది.. నిధులన్నీ మింగేశారు

Cm Chandrababu

Cm Chandrababu

పల్నాడు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. యలమంద గ్రామంలో లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి నేరుగా పెన్షన్లు అందించారు. ఆ తర్వాత గ్రామస్తులతో ముఖాముఖి మాట్లాడిన సీఎం చంద్రబాబు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం వ్యవస్థ మొత్తాన్ని సర్వనాశనం చేసిందని ఆరోపించారు. కేంద్ర నిధులన్నీ మింగేశారు.. నిధులన్నీ పక్కదారి పట్టించారని తెలిపారు. మోడీ ప్రధాని అయిన తర్వాత ప్రతి ఇంటికి కులాయి ద్వారా నీరు ఇవ్వాలని ఏర్పాటు చేసిన స్కీము నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. ఆ స్కీం నిర్వహణకు డబ్బులు తెచ్చి పక్కదారి మళ్లించారు.. అనేక స్కీంల డబ్బు దారి మళ్ళిందని చంద్రబాబు తెలిపారు. తాను కష్టపడతానని.. సంపద సృష్టిస్తానని.. ఆ సృష్టించిన సంపాదన పేదవారికి అందిస్తానని చెప్పారు.

Read Also: PM Modi: ఈ ఏడాది సాధించిన విజయాలను ఎక్స్‌లో పోస్టు చేసిన మోడీ

ఒకప్పుడు రోడ్లన్నీ గోతులే.. తాను రాగానే రోడ్లన్నీ రిపేర్ చేయిస్తున్నానని సీఎం చంద్రబాబు తెలిపారు. సంక్రాంతికి ఒక నెల అటూ ఇటూ రోడ్లన్నీ బాగు చేయిస్తానన్నారు. అలాగే.. చెత్త పన్ను తీసివేశానని తెలిపారు. మరోవైపు.. అమరావతిని ఇష్టానుసారం చేశారు.. కూటమి ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం నిధులు 15 వేల కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. మన రాష్ట్రానికి ఒకే రాజధాని అమరావతిని పట్టాలెక్కిస్తామని చెప్పారు. గతంలో మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలాట ఆడారు.. ఐదు సంవత్సరాల సమయాన్ని వృధా చేశారు.. రాష్ట్రానికి రాజధాని లేని అనాధ చేశారన్నారు. రాష్ట్రంలో
ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తామని చెప్పారు. నదుల అనుసంధానంతో ప్రతి ఇంటికి, ప్రతి ఎకరానికి నీళ్ళు అందిస్తామని సీఎం వెల్లడించారు. 80,000 కోట్ల రూపాయలతో నదులు అనుసంధానం చేస్తామని పేర్కొన్నారు. ఎలమంద గ్రామానికి కూడా పోలవరం నుంచి నీళ్లు ఇస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. జల హారతి కార్యక్రమంలో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని అన్నారు.

Read Also: January 2024 Movie Roundup: ఇళయరాజా కుమార్తె మృతి.. చిరంజీవికి పద్మ విభూషణ్.. హను-మాన్ పంచాయితీ!

వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని అప్పలపాలు చేశారు.. తమ ప్రభుత్వం వచ్చాక ఆ అప్పులను తీరుస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే లోపు.. డీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీ చేస్తామన్నారు. అలాగే..ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం.. మద్యం పాలసీ, ఇసుక పాలసీ తీసుకొచ్చామని తెలిపారు. ఇసుక విషయంలో దందాలు ఉంటే క్షమించేది లేదు.. పేదలకు ఇసుక అందకుండా చేస్తే చర్యలు ఉంటాయని అన్నారు. మరోవైపు.. గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ ని నిర్మించాలని సీఎం చెప్పారు. గంజాయి వల్ల నేరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయి.. త్వరలోనే వాట్సప్ గవర్నెన్స్ తీసుకొస్తున్నామని అన్నారు. 150 సర్వీసులు ఈ గవర్నెన్స్‌లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఇందుకోసం ఏఐ టెక్నాలజీ కూడా ఉపయోగిస్తామని చెప్పారు. పల్నాడులో హింస పోవాలి, అభివృద్ధి రావాలన్నారు. తన లాంటి వాడిని కూడా మాచర్లకు రానీయకుండా అడ్డుకున్నారు.. దారి తప్పిన వాళ్ళను చండశాసనుడిగా మారి తాటతీస్తానని హెచ్చరించారు. సోషల్ మీడియా ద్వారా అసభ్య కామెంట్లు పెడుతున్నారు.. అలాంటి వారి తాటతీస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.

Show comments