NTV Telugu Site icon

CM Chandrababu: గ్రామస్తులతో ముఖాముఖి.. సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు

Babu

Babu

CM Chandrababu: పల్నాడు జిల్లా పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. యలమందలో లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి నేరుగా పెన్షన్లు అందించారు.. ఆ తర్వాత గ్రామస్తులతో ముఖాముఖి మాట్లాడిన సీఎం చంద్రబాబు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఒకప్పుడు ముఖ్యమంత్రి వస్తున్నారంటే పరదాలు కట్టేవారు.. ఆడంబరాలు చేసేవారు.. చుట్టుపక్కల చెట్లు కొట్టేసేవారు అని ఎద్దేవా చేశారు.. ఒక ప్రజా ప్రతినిధి వస్తున్నారంటే దానికి గుర్తుగా మొక్కలు నాటాలి.. చెట్లు కొట్టకూడదు అని సూచించారు.. నేను ప్రజల ముఖ్యమంత్రిగా.. మీ స్నేహితుడిగా.. మీ ముందుకు వచ్చాను.. ఈ స్థితిగతులు తెలుసుకోవటానికి వచ్చాను.. మీ కష్టాలను బాధను పంచుకోవడానికి వచ్చాను.. అధికారులతో మాట్లాడి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని, మీ మొహాల్లో ఆనందం చూడాలని వచ్చాను.. గత ప్రభుత్వంలో నవ్వటానికి కూడా, స్వేచ్ఛ లేని పరిస్థితి ఉండేది.. ఈ రాష్ట్రంలో ఏ ఇంటిలో కష్టం వచ్చినా ,వాళ్ళింట్లో నేను ఒక ప్రాణ స్నేహితుడిగా మారి వాళ్ళని కాపాడుకుంటాను.. భవిష్యత్తులో ఉపక్కర పరిస్థితులు వస్తే డ్రోన్ లు ఉపయోగించి, మీ ఇళ్ళకే మెడిసిన్స్ పంపించే విధంగా టెక్నాలజీని అభివృద్ధి చేశాం అన్నారు చంద్రబాబు..

Read Also: Rachakonda CP: ప్రమాదాల నివారణకు ఫ్లైఓవర్లు క్లోజ్ చేస్తున్నాం.. డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు కొనసాగుతాయి!

పేదవాడి జీవితంలో నవ్వు చూడాలని లక్ష్యంతో పనిచేస్తున్నాను అన్నారు సీఎం చంద్రబాబు.. కరోనాతో కొన్ని కుటుంబాలు చితికిపోయాయి.. యలమందలో కూడా సారమ్మ కుటుంబం కరోనా తో నష్టపోయింది , ఆ కుటుంబానికి అండగా ప్రభుత్వం ఉంటుంది… సారమ్మ కుమార్తె ఇంటర్ చదువుతుంది.. ఆ అమ్మాయి డాక్టర్ అయ్యేవిధంగా ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.. యలమంద గ్రామంలో పెండింగ్‌లో ఉన్న, గృహ నిర్మాణ బిల్లులన్నీ చెల్లిస్తాం అన్నారు.. ఏడుకొండల కుటుంబానికి కూడా ఆర్థికంగా అండగా ఉంటాం.. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వ సొమ్ముతో పాటు, తెలుగుదేశం పార్టీ కూడా ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. ఓట్లు వేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని వేయండి.. 2004లో నేను గెలిచి ఉంటే, ఈ రోజు రాష్ట్రం అభివృద్ధి పథంలో ఒక ప్రత్యేక స్థానంలో ఉండేది అన్నారు.. మహిళల కోసం మూడు గ్యాస్ సిలిండర్ లు ఉచితంగా ఇవ్వాలని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. మహిళలు కట్టెల పొయ్యి జోలికి వెళ్లకూడదని నా నిర్ణయం అన్నారు.. ఒకప్పుడు నేను తీసుకున్న గ్యాస్ కనెక్షన్ నిర్ణయం వల్ల, ఈరోజు నేను ఒక కుటుంబానికి కాపీ పెట్టి ఇవ్వగలిగాను అని పేర్కొన్నారు.

Read Also: Fraud Case: ప్రధాని మోడీ కార్యదర్శికి కూతురు, అల్లుడు అంటూ.. కోట్లు వసూలు చేసిన జంట

నూతన సంవత్సర సందర్భంగా ఒకరోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నా.. గత ప్రభుత్వాలయితే ఒకరోజు ఆలస్యంగా పెన్షన్ ఇచ్చేవి.. 40 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో 2024 ని మర్చిపోలేను… 93 శాతం గెలుపు అందించారు అని సంతోషాన్ని వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు.. ఒక దశలో అరవింద బాబు గెలుస్తాడా? లేదా అని అనుమానం ఉండేది, కానీ ఆ అనుమానాన్ని పటా పంచలు చేశారు.. నన్ను ఎవరు ఏమీ చేయలేరు అని విర్రవీగితే కర్రు కాల్చివాత పెడతారు అని ప్రజలు నిరూపించారున్నారు. నాకు హై కమాండ్లు లేవు, ప్రజలే నా హై కమాండ్‌ అని వెల్లడించారు.. ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.. యలమంద గ్రామం టిడిపికి కంచికోట… ఈ శాశ్వతం కావాలి.. ఒక మంచి రాజకీయ పార్టీ వల్ల ప్రజల జీవితాలు బాగుపడతాయి.. సమర్థవంతమైన నాయకుడు కుటుంబం పెద్దగా ఉంటే వాళ్ల కుటుంబాలు బాగుపడతాయి.. సంతాపదినాలుగా ఉన్నాయి కాబట్టి కేక్ కట్ చేయలేకపోయాను, లేదంటే ఈ గ్రామంలో న్యు ఇయర్ కేక్ కట్ చేసేవాళ్లం అన్నారు..

Read Also: Manchu Vishnu : అడవి పందులను వేటాడిన వివాదంలో మంచు విష్ణు సిబ్బంది

పేదరికం లేని సమాజం నందమూరి తారక రామారావు కల.. సంపద సృష్టించాలి పేదరికం నిర్మూలించాలి అనేది నా ఆశయం అన్నారు సీఎం చంద్రబాబు.. 64 లక్షల మందికి పెన్షన్ ఇచ్చే ప్రభుత్వం టిడిపి ప్రభుత్వం.. ఎన్టీఆర్ ప్రారంభించిన పెన్షన్ కార్యక్రమం ఇది.. పెన్షన్ ను 200 నుండి 2000 చేసింది టిడిపి ప్రభుత్వం.. గత ప్రభుత్వం ముక్కుతూ మూలుగుతూ 3000 చేసింది… నేను రాగానే పెన్షన్ 4000 చేశాను.. పెన్షన్లకు ప్రతినెల 2700 కోట్లు ఖర్చు అవుతుంది.. సంవత్సరానికి 33 వేల కోట్లు ఖర్చు అవుతుంది.. అయినా పర్లేదు పేదల కళ్ళల్లో జీవితాల్లో నవ్వు చూడాలని వ్యాఖ్యానించారు సీఎం చంద్రబాబు నాయుడు..

Show comments