AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికలకు ముందే వేలంపాట.. సర్పంచ్ పదవికి రూ.81 లక్షలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Panchayat Elections: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలకు ముందే కొన్ని గ్రామాల్లో సర్పంచ్ పదవుల కోసం పోటీ ఆసక్తికరంగా మారుతోంది. కొన్ని చోట్ల ఏకగ్రీవం చేస్తే.. కోట్ల రూపాయలు ఇస్తాం.. ఎకరం పొలం రాసిస్తాం.. రూ.50 లక్షలైనా సరే రెడీ అనే వార్తలు వస్తున్నాయి.. ఎన్నికల బరిలో నిలిచేందుకు ఆశావహులు సిద్ధమవుతుండగా.. పల్నాడు జిల్లాలో మాత్రం సర్పంచ్ పదవికి వేలంపాట నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. నర్సరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలో సర్పంచ్ పదవిని దక్కించుకునేందుకు టీడీపీ నేతలు లక్షల రూపాయలతో పోటీపడ్డారు.
రూ.81 లక్షలకు చేరిన వేలం ధర
గ్రామానికి చెందిన సర్పంచ్ పదవి ఆశావహులతో గురువారం రాత్రి గ్రామ పెద్దలు వేలంపాట నిర్వహించినట్లు సమాచారం. ఈ వేలంలో ముగ్గురు టీడీపీ నాయకులు పాల్గొని పోటాపోటీగా ధరలు ప్రకటించారు. కొరిటాల గోపాలరావు సర్పంచ్ పదవిని దక్కించుకునేందుకు రూ.77 లక్షలు చెల్లించేందుకు సిద్ధమయ్యారు. అయితే మరో టీడీపీ నేత యర్రా శ్రీనివాసరావు ఏకంగా రూ.81 లక్షలు చెల్లించేందుకు ముందుకు వచ్చారు. చివరకు రూ.81 లక్షలతో వేలంపాటలో యర్రా శ్రీనివాసరావు సర్పంచ్ పదవిని దక్కించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయనను గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో నిలపాలని గ్రామ పెద్దలు నిర్ణయించినట్లు సమాచారం. ఈ వ్యవహారం స్థానికంగా రాజకీయ చర్చకు దారితీసింది.
Also Read
- Pamphlets Along With Ballots: ఓట్లతోపాటు పాంప్లెట్లు వేసిన ఓటర్లు.. మా గ్రామంను కాపాడండి అంటూ..!
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- CM Chandrababu: రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశాం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
- Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో వివాహితపై అత్యాచారం..
గ్రామంలో హాట్ టాపిక్‌గా వేలంపాట
సాధారణంగా పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవుల కోసం అభ్యర్థులు ప్రచారం, పోటీ చేస్తుంటారు. కానీ ఎన్నికలకు ముందే వేలంపాట ద్వారా సర్పంచ్ అభ్యర్థిని నిర్ణయించడం, అందులోనూ రూ.81 లక్షల భారీ మొత్తం పలకడం ఆసక్తికరంగా మారింది. సర్పంచ్ పదవి కోసం లక్షల్లో జరిగిన ఈ పోటీపై గ్రామంలోనే కాకుండా పల్నాడు జిల్లా రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. కాగా, మరోవైపు పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించే దిశగా సర్పంచ్‌తో పాటు అన్ని వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలకు అందించే ప్రోత్సాహక నిధులను భారీగా పెంచింది. ఈ మేరకు ప్రభుత్వం G.O.Rt.No.1111 ఉత్తర్వులను జారీ చేసింది. జనాభా ఆధారంగా ఏకగ్రీవ పంచాయతీలకు అందించే ప్రోత్సాహక మొత్తాలను సవరించింది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. 5,000 వరకు జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు రూ.15 లక్షల ప్రోత్సాహక నిధులు అందించనున్నారు. ఇందులో 2,000 లోపు జనాభా ఉన్న పంచాయతీలతో పాటు 2,001 నుంచి 5,000 వరకు జనాభా ఉన్న పంచాయతీలను ఒకే కేటగిరీగా పరిగణించారు. 5,001 నుంచి 10,000 వరకు జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు రూ.25 లక్షలు కేటాయించనున్నారు. ఇక, 10,000 కంటే ఎక్కువ జనాభా ఉన్న పంచాయతీలకు ఏకంగా రూ.50 లక్షల ప్రోత్సాహక నిధులు అందించనున్నారు.
తాజావార్తలు
-
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికలకు ముందే వేలంపాట.. సర్పంచ్ పదవికి రూ.81 లక్షలు!
-
Iran-US Tensions: ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు.. బహ్రెయిన్‌లో అమెరికా రాడార్‌ను ధ్వంసం చేశామన్న IRGC..!
-
IND vs NZ 4th ODI: ఆరేసిన మాట్ హెన్రీ.. 334 ఛేదనలో 89 పరుగులకే భారత్ ఆలౌట్!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
Rohit Sharma Golden Duck: తొలి బంతికే గోల్డెన్ డక్.. ఆ ఇద్దరు అన్నిసార్లా.. భారత బ్యాటర్ల లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..