కొత్త జిల్లా ప్రకటనతో ఏపీలోని కొన్ని ప్రాంతాలలో రియల్ బూమ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. చుట్టుపక్కల భూముల ధరలు రెట్టింపయ్యాయి.దీంతో పొలాలన్నీ వెంచర్లుగా మారిపోతున్నాయి. గుంటూరు జిల్లాలోని కొత్తగా రాబోతున్న పల్నాడు జిల్లాలో రియల్ బూమ్ ఊపందుకుంది. నర్సరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లా ఏర్పాటు ప్రకటనతో పల్నాడు వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా జిల్లా కేంద్రానికి రావాలంటే 125 కిలోమీటర్లు దూరం వెళ్లాల్సి రావడం ఇబ్బందిగా మారింది. కొత్తగా జిల్లా ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి.…