Varla Ramaiah : పాలకులు తమ చిత్త శుద్ది నిరూపించుకోవాలి
TDP Politburo Member Varla Ramaiah once Again made comments on YCP Government.
మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య. ముఖ్యమంత్రి గారూ! మీ ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయమైనా అందరికీ వర్తించేదిగా వుండాలి అంటూ వర్ల రామయ్య విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీ మహానాడుకు మీ ప్రభుత్వం ఆర్టీసీ బస్సులివ్వలేదని, ప్రైవేటు విద్యాసంస్థల బస్సులివ్వడానికి వీల్లేదని ఆదేశాలిచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రైవేటు బస్సుల పైనా, ఇతర రవాణా వాహనాలపైనా ఎన్నో నిషేధాజ్ఞలు విధించారని, ఇప్పుడు, అధికార పార్టీ ప్లీనరీకి కూడా అవే నిషేధాజ్ఞలు విధించాలని ఆయన కోరారు. ఆర్టీసి బస్సులు గానీ, విద్యాసంస్థల బస్సులు గానీ ఇవ్వకూడదని, చట్టం అందరికీ ఒకేలా వుండాలి.
ప్రజాపాలనంటే, అందరికీ సమానహక్కులు కల్పించడమేనంటూ ఆయన వ్యంగ్యస్త్రాలు సంధించారు. పాలకులు తమ చిత్త శుద్ది నిరూపించుకోవాలి అంటూ ఆయన చురకలు అంటించారు. అయితే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 12 సంవత్సరాలు పూర్తి అవుతున్న నేపథ్యంలో ప్లీనరీ సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో వర్ల రామయ్య పై కామెంట్లు చేశారు.
తాజావార్తలు
-
History: పూర్వం ఏసీలు, కూలర్లు లేవు కదా? మరి అంత ఎండలో రాజులు, చక్రవర్తులు ఎలా బ్రతికారు?
-
India – Russia: కష్టకాలంలో కదిలొచ్చిన ‘మిత్రుడు’.. చమురు సంక్షోభంలో భారత్‌ను ఆదుకున్న రష్యా!
-
Ganja: గంజాయి మాయలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. ఉద్యోగం వదిలి.. ఇంటిపైనే సాగు..
-
Lucky Zodiac Signs : మీన రాశిలోకి శని.. రేపటి నుంచి ఈ రాశుల వారికి అదృష్టం పట్టబోతోంది..!
-
SRH vs DC: ఉప్పల్‌లో ‘ఆరెంజ్’ ఆర్మీ వర్సెస్ ‘ఢిల్లీ’ వార్ షురూ.. టాస్ ఎవరు గెలిచారంటే!
ట్రెండింగ్
-
90’s Sweet : చిన్ననాటి ఈ ‘డ్రై రసగుల్లా’ గుర్తుందా.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు..!
-
Minapa Barfi Recipe : శక్తికి గని ‘మినప బర్ఫీ’.. అందరికీ బలవర్ధకమైన స్వీట్.!
-
Protein Rich Ulavala Dosa : బరువు తగ్గడానికి హెల్దీ బ్రేక్‌ఫాస్ట్.. ప్రోటీన్ రిచ్ ‘ఉలవల దోశ’.. ఇలా ట్రై చేయండి.!
-
రూ.11 వేలలోపే పవర్‌ఫుల్ ఫీచర్స్ తో REDMI A7, A7 Pro లాంచ్..!
-
AMOLED డిస్‌ప్లే, 10 రోజుల బ్యాటరీతో హువావే HUAWEI WATCH FIT 5 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!