NTV Telugu Site icon

Ntv Topnews: టుడే ఎన్టీవీ టాప్ న్యూస్

1 రాజ్యాంగాన్ని మార్చాలన్న సీఎం కేసీఆర్ మాటలు అర్ధరహితమని మందకృష్ణ మాదిగ అన్నారు. బుధవారం ఆయన మెదక్‌లోని టీఎన్జీవో భవన్‌లో రాజ్యాంగ పరిరక్షణ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలను మోసం చేయడానికే సీఎం కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలంటున్నడని, ప్రజాస్వామ్య స్ఫూర్తికి కేసీఆర్ వ్యతిరేకమని ఆయన విమర్శించారు. పాలకులను ప్రశ్నించే స్వేచ్ఛను ప్రజలు కోల్పోయే ప్రమాదం ఉందని, సీఎం కేసీఆర్ రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకి అని ఆరోపించారు. 

2.14వ ఆర్థిక సంఘం కాలవ్యవధి ముగియడంతో వివిధ పంచాయతీలకు పాత నిధులు ఇవ్వలేం అంటూ కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యసభలో ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి కపిల్‌ మోరేశ్వర్‌ పాటిల్‌ జవాబులిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం బకాయిపడిన 529.96 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయలేమని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపినట్లు పంచాయితీ రాజ్‌ శాఖ సహాయ మంత్రి కపిల్‌ మోరేశ్వర్‌ పాటిల్‌ వెల్లడించారు.

3.ఏపీకి ఇచ్చిన హామీలను కేంద్రం అమలుచేయాలని విజయవాడ ఎంపీ కేశినేని నాని కోరారు. ఆంధ్ర ప్రదేశ్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అమలు, విజయవాడ రైల్వే స్టేషన్ లో సౌకర్యాలను మెరుగుపరచాలని ఆయన కేంద్రమంత్రిని కోరారు. లోక్ సభలో దీనినే ప్రధాన అంశంగా ప్రస్తావించారు విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్. ఏపీ రాష్ట్రానికి సంబంధించి పలు సమస్యలను, సౌత్ కోస్ట్ రైల్వే జోన్లు పనితీరు గురించి మాట్లాడారు.

4.మెదక్‌లోని టీఎన్జీవో భవన్‌లో రాజ్యాంగ పరిరక్షణ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని, ప్రశ్నించే నేతలను జైల్లో పెడుతున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయమని అడిగితే అరెస్ట్ చేసి స్టేషన్ కు పంపారని ఆయన ఆరోపించారు. మల్లన్న సాగర్ రైతులు న్యాయం చేయమని అడిగినందుకు ఆ గ్రామాల్లో 144 సెక్షన్ పెట్టారని ఆయన విమర్శించారు.

5.ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపారు బ్రదర్‌ అనిల్, సీనియర్‌ రాజకీయ నేతలతో పాటు.. క్రిస్టియన్‌ నేతలు, ఎస్సీ, ఎస్సీ, బీసీ సంఘాల నేతలతో సమావేశాలు నిర్వహించారు.. ఇక, త్వరలోనే వైఎస్‌ షర్మిల ఏపీలోనూ కొత్త పార్టీ పెడతారనే గుసగుసలు వినిపిస్తున్నాయి… తాజాగా, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై బ్రదర్ అనిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దోషులు తప్పించుకోలేరని చెప్పారు. సీబీఐ నిష్పాక్షిక దర్యాప్తు చేస్తోందన్న ఆయన.. ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.

6.జేఈఈ మెయిన్ ఎంట్రెన్స్ 2022 తేదీలు మారడంతో తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ మార్చిన ఇంటర్‌ బోర్డు.. తాజాగా కొత్త తేదీలను ప్రకటించిన విషయం తెలిసిందే కాగా.. ఇదే సమయంలో రాష్ట్రంలో జరగనున్న ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షల షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేష‌న్… తెలంగాణలో మే 23వ తేదీ నుంచి ఎస్‌ఎస్‌సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రతీ పరీక్ష ఉద‌యం 9.30 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12.45 గంట‌ల వ‌ర‌కు నిర్వహించనున్నట్టు ఎస్‌ఎస్‌సీ బోర్డు వెల్లడించింది..

7.తెలంగాణలో గతంలో ప్రకటించిన ఇంటర్‌ పరీక్షల తేదీలు మారిపోయాయి.. జేఈఈ మెయిన్ ఎంట్రెన్స్ 2022 తేదీలు మారడంతో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ మార్చనున్నట్టు.. నేడో.. రేపో కొత్త షెడ్యూల్‌ వస్తుందంటూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే కాగా.. తాజాగా, ఇంటర్‌ పరీక్షలకు సంబంధించిన కొత్త తేదీలను ప్రకటించింది ఇంటర్‌ బోర్డు.. ఇక, ఏప్రిల్ 22 నుండి జరగాల్సిన పరీక్షలు… మే 6 నుండి ప్రారంభించాలని నిర్ణయానికి వచ్చారు.. తెలంగాణలో మే 6వ తేదీ నుంచి ఇంట‌ర్ ప‌రీక్షలు ప్రారంభం కానున్నాయి. 

8.క‌ర్ణాట‌క‌లో ప్రకంప‌న‌లు సృష్టించిన హిజాబ్ వివాదం సుప్రీంకోర్టు గ‌డప తొక్కింది. విద్యాల‌యాల్లోకి హిజాబ్‌ను అనుమ‌తించేది లేద‌న్న ఉడుపి విద్యా సంస్థ ఆదేశాల‌ను కొట్టేయాల‌ని కోరుతూ దాఖ‌లైన పిటిష‌న్‌ను క‌ర్ణాట‌క హైకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పుతో త‌మ‌కు న్యాయం జ‌ర‌గ‌లేద‌ని పిటిష‌నర్లు ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేశారు. క‌ర్ణాట‌క హైకోర్టు తీర్పును స‌వాల్ చేస్తూ స‌ర్వోన్నత న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు త‌లుపు త‌ట్టారు. హైకోర్టు తీర్పు వెలువ‌డిన కొద్ది గంట‌ల్లోనే పిటిష‌నర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

9.ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాలతో మరోపక్క రాజకీయాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పవన్ నటించిన భీమ్లా నాయక్ విడుదలై రికార్డ్ కలెక్షన్స్ రాబట్టిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం పవన్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహరవీరమల్లు షూటింగ్ చివరి అంకానికి చేరుకుంది. ఇక ఈ సినిమా తరువాత హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.

10.వివాహ్ సినిమాతో వెండితెరకు పరిచయమై.. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన హీరోయిన్ అమృతా రావ్. ఇక తెలుగులో అతిధి చిత్రంలో మహేష్ సరసన ముద్దుగా కనిపించి మెప్పించిన ఈ భామ.. ఈ చిత్రం తరువాత తెలుగుఫులో ఎక్కడా కనిపించలేదు. ఇక బాలీవుడ్ లో అమ్మడి లవ్ స్టోరీ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఆమె ఆర్జే అన్మోల్ తో ప్రేమలో పడింది. ప్రేమలో ఉన్నప్పుడే ఇద్దరు ఇంట్లో ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకొని సీక్రెట్ గా రిలేషన్ కొనసాగించిన వీరు.. ఇటీవల మరోసారి పెళ్లి చేసుకున్నారు. ఈసారి పెద్దల సమక్షంలో.. అందరి అనుమతితో పెళ్లి పీటలు ఎక్కారు. ఈ విషయాన్ని ఈ జంట తమ యూట్యూబ్ ఛానెల్ ద్వారా తెలిపారు.