1.టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటుడు బాలయ్య ఈ రోజు ఉదయం కన్నుమూశారు. హైదరాబాద్ యూసఫ్ గూడలోని తన స్వగృహంలో శ్రీ బాలయ్య తుదిశ్వాస విడిచారు. నిజానికి ఈరోజు ఆయన పుట్టినరోజు. ఇలా బాలయ్య పుట్టినరోజు నాడే తిరిగిరాని లోకాలకు వెళ్లడం అందరినీ కలచి వేస్తోంది. గత కొంతకాలంగా వయసు సహకరించక పోవడంతో నటనకు కూడా దూరంగా ఉంటున్న బాలయ్య ఈ రోజు తుదిశ్వాస విడిచారు.
https://ntvtelugu.com/veteran-actor-balayya-passes-away-at-94/
2.దేశంలోని 14 రాష్ట్రాలకు రెవెన్యూలోటు గ్రాంటు కింద 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేంద్రం రూ.7,183.42 కోట్ల నిధులను విడుదల చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఈ రాష్ట్రాలన్నింటికీ రూ.86,201 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడుతుందని లెక్కించి ఆ మొత్తాన్ని 12 సమాన వాయిదాల్లో ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక సంఘం సూచించింది. అందులో తొలివిడత నిధులను శుక్రవారం నాడు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.
https://ntvtelugu.com/central-government-released-879-crores-funds-to-ap-under-revenue-deficit-grant/
