ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సర్వ దర్శనం టోకెన్ల జారీ ప్రారంభం అయింది. తిరుపతిలో భూదేవి కాంప్లెక్స్,శ్రీనివాసం,గోవిందరాజ సత్రాల వద్ద టోకెన్లు జారీచేస్తోంది టీటీడీ. రోజుకి 15 వేల చొప్పున టోకెన్లు ఇస్తోంది. నిరంతరం కొనసాగనుంది టోకెన్ల జారీప్రకియ. కరోనా కారణంగా సర్వదర్శనం టోకెన్లు జారీ నిలిపివేశారు. తాజాగా ఆ ప్రక్రియ ప్రారంభం కావడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తిరుపతిలోని శ్రీకాళహస్తి ఆలయం మహాశివరాత్రి మహోత్సవాలకు ముస్తాబవుతోంది. ఈనెల 24 వతేదీ నుండి శ్రీకాళహస్తి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతాయని ఈవో డి.పెద్దిరాజు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అటు విజయవాడ దుర్గమ్మ ఆలయంలో ఈనెల 24 వతేదీ నుండి శ్రీకాళహస్తి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు.
2021 నవంబర్‌లో భారీ వర్షాలు, వరదల వల్ల పంట నష్ట పోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందచేయనుంది ఏపీ ప్రభుత్వం. రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయనున్నారు ముఖ్యమంత్రి జగన్. ఉదయం 11 గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో నగదు జమ చేస్తారు. మొత్తం 534.77 కోట్ల రూపాయలు జమ చేయనున్నారు. దీని ద్వారా 5,71,478 మంది రైతులకు లబ్ది చేకూరనుంది.
ఓయూ లోని అన్ని కోర్సుల ప్రస్తుత సెమిస్టర్ పరీక్షలు కోవిడ్ కు ముందు ఉన్న మాదిరిగానే పరీక్ష టైమ్ 3 గంటలు వుంటుందని ఓయూ అధికారులు తెలిపారు. అయితే, సంబంధిత కోర్సుల సెక్షన్-బిలో ప్రశ్నలలో ఛాయిస్ లు ఎక్కువగా ఉంటాయని వెల్లడించారు. విద్యార్ధులు ఈ విషయం గుర్తుంచుకోవాలన్నారు.
తెలంగాణలో చలి తీవ్రత కొనసాగుతోంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొమురం భీం జిల్లా కెరమెరిలో 11.7 గా నమోదు అయింది. వాంకి డి లో 12.1 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూ ర్ లో 12.1డిగ్రీలు నమోదయింది. సోనాలలో 12.6 గా కనిష్ట ఉష్ణోగ్రత లు నమోదు కాగా నిర్మల్ జిల్లా పెంబిలో 13.6 గా కనిష్ట ఉష్ణోగ్రత లు నమోదయ్యాయి.