Site icon NTV Telugu

YS Jagan: ప్రశ్నిస్తే దాడులు చేస్తారా..? తగలబెడతారా..?

Ys Jagan

Ys Jagan

YS Jagan: మాజీ మంత్రి జోగి రమేష్‌ ఇంటికి వెళ్లి.. దాడి జరిగిన ఆ ఇంటిని పరిశీలించిన వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌.. ఆ కుటుంబాన్ని పరామర్శించారు.. దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.. వారికి ధైర్యాన్ని చెప్పారు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపితే.. ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?.. తగలబెడతారా..? అంటూ ఫైర్‌ అయ్యారు.. జోగి రమేష్ ఇల్లు మొత్తం చిన్నాభిన్నం అయ్యింది.. పక్కనే ఉన్న కరెంట్ ప్లగ్స్ అంటుకుని ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళ నాన్న పరిస్థితి ఏంటి..? అని ప్రశ్నించారు.. బీసీ నాయకుడి వాయిస్ అణగదొక్కాలని ఇలా చేయటం న్యాయమా..? అని ఆవేదన వ్యక్తం చేశారు.. రమేష్ ఇంటిపై 5 గంటలకు దాడి జరిగితే పోలీసులు, టీడీపీ నేతలు పథక రచన చేశారు.. పోలీసులు, టీడీపీ నేతలతో కలసి ప్లాన్ చేసి దాడి చేశారని విమర్శించారు.. టీడీపీ నేతలు పోలీసులను వెంటబెట్టుకుని వచ్చి దాడి చేసిన వీడియో ఫుటేజ్ లు కూడా ఉన్నాయన్న ఆయన.. పోలీసుల సమక్షంలోనే నిప్పు పెట్టారు.. దాడి చేసిన టీడీపీ నేతలు మొత్తం చంద్రబాబు, లోకేష్ కి అత్యంత సన్నిహితులే అని తెలిపారు..

Read Also: YS Jagan: కళ్లు మూసుకుని తెరిస్తే రెండేళ్లు గడిచాయి.. మరో మూడేళ్లు కళ్లు మూసుకుంటే వచ్చేది మన ప్రభుత్వమే..

మనం నాగరిక ప్రపంచంలో ఉన్నామా..? జంగిల్ రాజ్ లో ఉన్నామా..? అనటానికి ఇదో ఉదాహరణగా పేర్కొన్నారు వైఎస్‌ జగన్‌.. జోగి రమేష్ ఆయన మీద పెట్టిన అక్రమ కేసులో విచారణకు హాజరయ్యేందుకు వెళ్లిన సమయంలో దాడి చేశారు.. లోకల్ పోలీసులతో పాటు సీపీ ఫోన్ కూడా ఎత్తలేదు.. అంబటి రాంబాబు ఇంటి దగ్గర దహనకాండ సమయంలో కూడా పోలీసులు ఇలాగే చేశారు.. పోలీసుల సమక్షంలోనే అక్కడ కూడా దాడి జరిగిందన్నారు.. జోగి రమేష్‌ ఇంటిపై పెట్రోల్‌ బాంబులు, యాసిడ్‌ బాటిళ్లతో దాడులు చేయడం కూటమి ప్రభుత్వం అరాచక పాలనకు నిదర్శనమంటూ మండిపడ్డారు.. గుంటూరులో అంబటి రాంబాబు.. ఇక్కడ జోగి రమేష్‌ ఇంటిని ధ్వంసం చేశారు. అంబటి రాంబాబు ఇంట్లోకి చొరబడ్డారు.. విధ్వంసం సృష్టించారు. అంబటి కుటుంబ సభ్యులపై దుర్భాషలాడారు. అంబటి ఆఫీస్‌ను కూడా తగలబెట్టారు. అంబటి ఇంట్లో, ఆఫీస్‌లో జరిగిన జంగిల్‌ రాజ్‌ను.. జోగి రమేష్‌ విషయంలో కూడా కొనసాగించారని ఆవేదన వ్యక్తం చేశారు..

Exit mobile version