NTV Telugu Site icon

AP Crime: ప్రాణం తీసిన పందెం.. రూ.2 వేల కోసం వెళ్తే..!

Gopichand

Gopichand

AP Crime: కొందరికి పందెం కాయడం సరదా? పందెంలో గెలిస్తే.. చెప్పలేని సంతోషం.. ఆనందం.. కిక్‌ ఉంటాయి.. అందుకే కొన్ని సార్లు రిస్క్‌ కూడా చేస్తారు.. అదే ప్రాణాల మీదకు తెచ్చిన సందర్భాలు ఎన్నో ఉంటాయి.. చిన్న మొత్తం కోసం పందెం కాసి.. ప్రాణాలు కోల్పోయినవారు కూడా చాలా మంది ఉంటారు.. మరికొందరు తాగినమైకంలో పందెం కాస్తుంటారు.. అలాంటి ఘటనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్‌ జిల్లాలో చోటు చేసుకుంది.. రూ. 2 వేల పందెం కాసి.. వాగులో దూకిన ఓ యువకుడు కనబడకుండా పోవడం.. ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది..

Read Also: Floods Damage in AP: అంతకంతకు పెరుగుతోన్న వరద నష్టం.. ప్రాథమిక అంచనాలు దాటేస్తోంది..

ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నందిగామలో రెండు వేల రూపాయల కోసం వాగులో దూకాడు గోపీచంద్‌ అనే యువకుడు.. రోశయ్య అనే మరో యువకుడితో రూ.2 వేల పందెం కాసిన గోపీచంద్.. పందెంలో భాగంగా నందిగామ పెద్ద బ్రిడ్జిపై నుంచి నీటిలో దూకాడు.. కానీ.. తిరిగి రాలేదు.. రోశయ్య, గోపీచంద్ మధ్య పందెం కుదురించింది.. ఇద్దరూ వాగులోకి దూకి.. ఎవరు ముందు ఒడ్డుకు చేరితే వారికి 2 వేలు ఇచ్చేలా పందెం వేసుకున్నారు.. పందెంలో భాగంగా మున్నేరు వాగులోకి దూకారు ఇద్దరు యువకులు.. అయితే, దూకిన తర్వాత రోశయ్య ఒడ్డుకు చేరాడు.. కానీ. మాడుగుల గోపిచంద్ అనే యువకుడు గల్లంతయ్యాడు.. ఇక, సమాచారం తెలుసుకున్న పోలీసులు.. స్థానికులు గోపీచంద్‌ కోసం ఎంత గాలించినా.. ఉపయోగం లేకుండా పోయింది.. గోపీచంద్ ఆచూకీ లభించలేదు.. అయితే, మద్యం మత్తులో ఇలా చేశారని పోలీసులు గుర్తించారు.. కానీ, మద్యం మత్తులో చేసినా.. మామూలుగా చేసినా.. రూ.2 వేల పందెం.. ఓ నిండు ప్రాణాన్ని తీసింది..

Show comments