Site icon NTV Telugu

TDP: మహిళా కమిషన్‌ ఎపిసోడ్‌లో ట్విస్ట్.. తెరపైకి కొత్త అంశం..!

Bonda Uma

Bonda Uma

విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో సామూహిక అత్యాచార ఘటన తర్వాత.. ఏపీ మహిళా కమిషన్‌ ఎపిసోడ్‌ వార్తల్లో నిలిచింది.. దీనికి కారణం.. పరామర్శల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ మధ్య జరిగిన వాగ్వాదం.. ఆ తర్వాత, ఆరోపణలు, విమర్శలు, నోటీసులు, ఆందోళనల వరకు వెళ్లింది.. తాజాగా, ఈ వ్యవహారంలో కొత్త అంశాన్ని తెర మీదకు తెచ్చారు టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు.. బాధితుల గోప్యత పాటించే విషయంలో వాసిరెడ్డి పద్మే నిబంధనలను అతిక్రమించారంటూ ఆరోపించారు.. మహిళా కమిషన్‌ వాట్సాప్‌ గ్రూపులో బాధితులను ఓదారుస్తున్న వాసిరెడ్డి పద్మ విజువల్స్‌, ఫొటోలను మీడియాకు విడుదల చేశారన్నారు బోండా ఉమ.. వాటికి సంబంధించిన మహిళా కమిషన్ వాట్సాప్ గ్రూప్ స్క్రీన్ షాట్లను బయటపెట్టారు..

Read Also: Harish Rao : కేంద్రం మాటల్లో అచ్చే దిన్‌.. కానీ.. చేతల్లో సచ్చేదిన్‌..

వాసిరెడ్డి పద్మ లేని అధికారాలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తోందని ఆరోపించారు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బోండా ఉమ.. తాడేపల్లి నుంచి వచ్చిన స్క్రిప్ట్‌ను ఫాలో కావాలనుకుంటే తమ వద్ద కుదరదు.. వ్యక్తిగత గోప్యత గురించి మాట్లాడే హక్కు వాసిరెడ్డి పద్మకు లేదన్నారు.. మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ అధికారిక వాట్సాప్‌ గ్రూపుల్లో బాధితురాలి.. బాధిత బంధువుల ఫొటోలు.. విజువల్స్‌ పెట్టింది నిజం కాదా..? అని ప్రశ్నించారు. పది కాదు.. దానికి 90 కలుపుకుని నాపై కేసులు పెట్టినా నేను భయపడేదే లేదన్నారు.. క్వాసి జుడిషీయరీ అధికారాలున్న మహిళా కమిషన్‌ ఛైర్‌ పర్సన్‌కు మాకు నోటీసులిచ్చే అధికారమే లేదన్నారు.. తాడేపల్లి నుంచి ఏదో రాసిచ్చారని.. వాసిరెడ్డి ఆ కాగితాన్ని చదివేశారని ఎద్దేవా చేశారు.. చంద్రబాబు వస్తున్నారు కాసేపు ఆగి రావాల్సిందిగా పోలీసులు కోరినా.. వాసిరెడ్డి పద్మ వినలేదని.. చంద్రబాబు వచ్చినా సరే నేనూ వస్తానంటూ పోలీసుల సూచనలను పట్టించుకోలేదని.. ప్రచారం కోసమే వాసిరెడ్డి పద్మ పాకులాడుతున్నారని ఫైర్ అయ్యారు బోండా ఉమ.

Exit mobile version