NTV Telugu Site icon

Kurnool: హంద్రీనీవా ప్రధాన కాలువను పూడ్చేసిన నేషనల్ హైవే కాంట్రాక్టర్..

Karnool

Karnool

కర్నూలు జిల్లాలో నందికొట్కూరు మండలం బ్రహ్మణ కొట్కూరు వద్ద హంద్రీనీవా ప్రధాన కాలువను నేషనల్ హైవే కాంట్రాక్టర్ పూడ్చేశారు. శ్రీశైలం జలాశయం నిండినా హంద్రీనీవా కాలువకు నీరు విడుదల చేయలేని పరిస్థితి ఏర్పాడింది. కర్నూలు- ఆత్మకూరు మధ్య నేషనల్ హైవే నిర్మాణంలో భాగంగా వంతెన నిర్మాణానికి హంద్రీనీవా కాలువను సదరు కాంట్రాక్టర్ పూడ్చి వేసేశారు. జూన్ ఆఖరు నాటికి కాలువలో మట్టి తొలగిస్తామనే కండిషన్ తో ఇరిగేషన్ అధికారులు అనుమతించారు. జూలై ముగిసినా కాలువలో మట్టి తొలగించకపోవడంతో శ్రీశైలం జలాలను అధికారులు విడుదల చేయలేదు.

Read Also: Kejriwal: ఆగస్టు 12న సీబీఐ చార్జిషీట్‌ పరిశీలించనున్న ఢిల్లీ కోర్టు

కాగా, ఇరిగేషన్ అధికారులు నోటీస్ ఇచ్చినా నేషనల్ హైవే కాంట్రాక్టర్ స్పందించలేదు.. హైవే కాంట్రాక్టర్ తీరుతో హంద్రీనీవా కింద లక్షల ఎకరాలకు సాగునీరు అందని పరిస్థితి ఏర్పాడింది. హంద్రీనీవా కాలువలో కాంట్రాక్టర్ మట్టి తొలగించి నీరు వదిలేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. హంద్రీనీవా కాలువ దుస్థితిని సీపీఎం నేతల బృందం పరిశీలించారు.

Read Also: Minister Ramprasad Reddy: ఆ అధికారులే భూ రికార్డులను కాల్చివేశారు..?

ఇక, తక్షణమే ఎన్ హెచ్ ఏఐ డైవర్షన్ రోడ్డును తొలగించి హంద్రీనీవా ద్వారా రాయలసీమకు నీరందించాలి అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. రాయలసీమ ప్రాంతంలో వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. కర్నూలు- ఆత్మకూరు హైవేలో బ్రిడ్జి కోసం హంద్రీనీవా కాలువ పూడ్చి వేశారు అంటూ మండిపడ్డారు. శ్రీశైలం ప్రాజెక్టు జలాశయం నీటితో నిండినప్పటికీ రాయలసీమకు నీళ్లు ఇచ్చే పరిస్థితి లేకపోవడం విచారకరం అని మండిపడ్డారు. ఆగస్టు 1వ తేదీన మడకశిరకు వస్తున్న సీఎం రాయలసీమ కరువు ప్రాంతాల్లో పర్యటించాలి అని సీపీఐ రామకృష్ణ డిమాండ్ చేశారు.