Site icon NTV Telugu

Narendra Modi : 175 దేశాలు యోగాను అనుసరిస్తున్నాయి.. యోగాపై ఇకో సిస్టంని డెవలప్‌ చేస్తున్నాం

Narendra Modi

Narendra Modi

Narendra Modi : విశాఖపట్నం సాక్షిగా అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా ప్రారంభమైంది. సముద్రతీరాన లక్షలాది మంది ప్రజలు చేరి యోగాసనాలు చేస్తూ ఈ వేడుకను ఆహ్లాదంగా జరుపుకుంటున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, అనేక మంది ప్రముఖులు ఈ విశిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. యోగా ప్రపంచాన్ని ఏకం చేసిందన్నారు. 175 దేశాలు యోగాను అనుసరిస్తున్నాయని, యోగా గ్లోబలైజ్‌ కావడం సామాన్యమైన విషయం కాదని ఆయన వ్యాఖ్యానించారు. యోగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజల జీవన శైలిని మార్చిందని, అంతరిక్షంలో కూడా యోగా చేసిన ఘనత మనదే అని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.

Off The Record: కవిత ఫోన్ కూడా ట్యాపింగ్? అందుకే కామ్గా ఉన్నారా?

అంతేకాకుండా.. యోగాకు సరిహద్దుల్లేవు.. వయసుతో పనిలేదని, ప్రకృతి, ప్రగతి సంగమం.. విశాఖపట్టణమన్నారు. యోగాంధ్ర ఈవెంట్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఏపీ సర్కారుకు అభినందనలు తెలిపారు ప్రధాని మోడీ. సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ప్రజల భాగస్వామ్యానికి ఇదొక స్ఫూర్తిగా నిలిచిందని, వికసిత్‌ భారత్‌ ఆలోచనలకు ఇది రూపం అని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.

యోగా మనల్ని నడిపిస్తుందని, యోగా మనల్ని మేల్కొలుపుతుందన్నారు. యోగా వ్యక్తిగత క్రమశిక్షణకు మారుపేరని, ప్రపంచ గమనాన్ని మార్చింది యోగా అని ఆయన పేర్కొన్నారు. వన్‌ఎర్త్‌.. ఎన్‌ హెల్త్‌ థీమ్‌తో ఈసారి యోగా దినోత్సవాన్ని నిర్వహించామని, యోగా ప్రక్రియతో చికిత్స చేసే విధానాన్ని ఢిల్లీ ఎయిమ్స్‌ అభివృద్ధి చేస్తోందన్నారు. యోగాను మరింత ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఇకో సిస్టంని డెవలప్‌ చేస్తున్నామని ప్రధాని మోడీ తెలిపారు. యోగా గురించి మన్‌ కీ బాత్‌లో కూడా విస్త్రృతంగా చర్చించానని, రోజూ మనం తినే ఆహారంలో 10 శాతం నూనె తగ్గించాలన్నారు మోడీ. సంతులిత జీవన శైలిని అలవాటు చేసుకోవాలని ప్రజలకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.

Cucumber Benefits: రోజూ కీర దోసకాయ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు..?

Exit mobile version