Nara Lokesh : పార్టీ లైన్ దాటొద్దు.. నేతలకు లోకేష్ కీలక సూచన
- పార్టీ నిర్ణయాలకు ప్రతి నాయకుడు కట్టుబడి పనిచేయాలి
- 45 రోజుల్లో 1.13 కోట్ల ఇళ్లను టీడీపీ నేతలు సందర్శించారు
- పెర్ఫార్మెన్స్ ఆధారంగానే పార్టీలో గుర్తింపు ఉంటుందన్న లోకేష్
- గ్రాస్‌రూట్ కేడర్‌కు పార్టీ కార్యక్రమాల కోసం ఏఐ వినియోగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎంత సీనియర్ నేతలైనా టిడిపి లైన్‌కు కట్టుబడి పని చేయాల్సిందేనని టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ అన్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ శిక్షణాతరగతుల ట్రైనర్లతో లోకేష్ మీట్ అండ్ గ్రీట్ నిర్వహించారు.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 8,300మంది క్లస్టర్, బూత్ ఇన్చార్జిలకు శిక్షణా తరగతులు పూర్తి చేశామని, 50వేలమందికి శిక్షణ ఇవ్వడం లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో నాయకులకు శిక్షణా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని, సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్లు అన్న పార్టీ మూల సిద్ధాంతానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని కోరారు లోకేష్.
టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్.పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియర్ నేతలతో సమావేశం అయ్యారు… ప్రజా దర్బార్ లో వినతిపత్రాలు తీస్కున్నారు. టీడీపీ ట్రైనింగ్ రీ సోర్స్ పర్సన్ శిక్షణా తరగతుల కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల చేపట్టిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా 45రోజుల్లో 1.13 కోట్ల ఇళ్లను నాయకులు సందర్శించారన్నారు లోకేష్. పార్టీకంటే ఎవరూ గొప్పవారు కాదని, ఏదైనా అంశంపై పార్టీ నిర్ణయం తీసుకున్నాక అందరూ దానికి కట్టుబడి పనిచేయాల్సిందేనని స్పష్టం చేశారు.
Also Read
- Nara Lokesh : ఏపీలో దుర్గాదేవి మండపాలకు మంత్రి నారా లోకేష్ తీపి కబురు
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
- Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
- Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
పార్టీలో కేవలం పెర్ఫార్మెన్స్ ఆధారంగానే నాయకులకు గుర్తింపునిస్తామని, ఈ విషయంలో ఎటువంటి సిఫారసులు, పైరవీలకు తావీయబోమని స్పష్టంచేశారు. లోకేష్…పార్టీ కార్యక్రమాలను మరింత వేగంగా, సులభంగా గ్రాస్ రూట్ స్థాయి కేడర్ కు తీసుకెళ్లేందుకు ఎఐని వినియోగిస్తున్నామని, అధునాతన టెక్నాలజీపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. శిక్షణా తరగతులకు వచ్చే నాయకులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నాం, అందరూ ఆర్థికంగా బలోపేతమై సొంతకాళ్లపై నిలబడేలా చేయాలన్నది పార్టీ అధినేత అంతరంగమని తెలిపారు.
కేంద్రంలో బిజెపి వరుసగా మూడుసార్లు అధికారంలోకి రావడానికి ఆ పార్టీ కేడర్ కమిట్ మెంట్ ప్రధాన కారణమని లోకేష్ అన్నారు. రాష్ట్రంలో కూడా ప్రభుత్వ కొనసాగింపు కోసం ప్రతిఒక్కరూ కష్టపడి పనిచేయాలన్నారు. అందరికీ ఒకేసారి న్యాయం చేయడం సాధ్యం కాదని, వివిధ కారణాల వల్ల తొలిదశలో అవకాశాలు రానివారికి మలివిడతలో అవకాశం కల్పిస్తామని లోకేష్ చెప్పారు. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావం నుంచి సేవలందిస్తున్న పలువురు సీనియర్ నాయకుల అనుభవాలను లోకేష్ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మానవ వనరుల విభాగం కోఆర్డినేటర్ వేపాడ చిరంజీవి, ఎంపి చింతకాయల విజయ్ తదితరులు పాల్గొన్నారు. సమర్థవంతంగా శిక్షణాతరగతులు నిర్వహిస్తున్న పార్టీ సీనియర్ నాయకులకు మంత్రి లోకేష్ ప్రశంసాపత్రాలు అందజేశారు.
తాజావార్తలు
-
Nara Lokesh : పార్టీ లైన్ దాటొద్దు.. నేతలకు లోకేష్ కీలక సూచన
-
Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
-
Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
-
SS Rajamouli: బాహుబలి ‘కిలికి’ని మించేలా జక్కన్న సరికొత్త ప్రయోగం?
-
Nana Patekar: కార్గిల్ వార్‌లో నానా పటేకర్.. అల్విదా నానా భాయ్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!