Nara Lokesh: 8 మందిని కాల్చిన చంపిన మీ నాన్న చరిత్ర మర్చిపోయారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏలూరు జిల్లాలోని గణపవరంలో సీఎం జగన్ ‘వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన నేపథ్యంలో.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ ఆయనకు ఓ లేఖ రాశారు. అందులో రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడిన ఆయన.. పలు అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. రైతురాజ్యం తెస్తానని గద్దెనెక్కి, ఇప్పుడు రైతుల్లేని రాజ్యంగా ఆంధ్ర రాష్ట్రాన్ని మార్చారంటూ ఆరోపించారు. రైతులకి జరిగిన అన్యాయం, వ్యవసాయ రంగ సంక్షోభంతో పాటు.. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రైతులపై జరిగిన దాష్టీకాలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
జగన్ దరిద్ర పాదం ఎఫెక్ట్‌తో రైతు రాజ్యం కాదు కదా.. అసలు రైతు బతికుంటే చాలు, అదే పదివేలు అనేలా దుస్థితి ఉందని లోకేష్ విమర్శించారు. ‘‘అప్పుల అనుమతి కోసం వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టి, రైతుల మెడకి ఉరితాళ్లు బిగించిన నీచుడు ఎవరు? మూడేళ్ల పాలనలో, కనీసం ఒక్కటంటే ఒక్క చిన్న కాలువైనా తవ్వారా? ఒక్క చిన్న సాగు నీటి ప్రాజెక్ట్ కట్టారా? రైతుల నుంచి గతేడాది కొనుగోలు చేసిన ధాన్యం డబ్బుల్ని ఇచ్చారా? అసలు ఈ ఏడాది ధాన్యం కొన్నారా? రూ. 3500 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏమైంది? ఇన్పుట్ సబ్సిడీ ఎక్కడ? తుఫాన్లు, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఎంతిచ్చారు? పంటల బీమా ప్రీమియం కట్టామన్నారు.. అలాంటప్పుడు రైతులకి ఎందుకు ఇన్సూరెన్స్ వర్తించలేదు? రూ.12,500 రైతు భరోసా ఇస్తానని మాటిచ్చి.. కేవలం రూ.7,500 ఇస్తోందెవరు? అసలు రాష్ట్రవ్యాప్తంగా కౌలు రైతులని గుర్తించారా?’’ అంటూ లోకేష్ ఆ లేఖలో ప్రశ్నించారు.
Also Read
- Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
- Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
అంతేకాదు.. వ్యవసాయ యాంత్రీకరణ, డ్రిప్ ఇరిగేషన్, సూక్ష్మపోషకాలు లాంటివి ఏమయ్యాయని లోకేష్ నిలదీశారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ రంగ వ్యతిరేక బిల్లులకు మద్దతిచ్చిన మూర్ఖుడు ఎవరని, ఆంధ్రప్రదేశ్ ఎప్పుడో మర్చిపోయిన క్రాప్ హాలిడేను మళ్ళీ తీసుకొచ్చిన అసమర్థుడెవరని అడిగారు. రైతులకు రూ.3 లక్షల వరకు సున్నావడ్డీ నిబంధనని టీడీపీ తీసుకొస్తే.. దాన్ని కేవలం రూ.1 లక్షకే పరిమితం చేసిందెవరన్నారు. ‘‘రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే ఏపీ మూడో స్థానంలో ఉండడానికి కారణం మీరు కాదా? ముదిగొండలో 8 మంది రైతుల్ని కాల్చి చంపిన మీ నాన్న చరిత్ర మర్చిపోయారా? సోంపేటలో తమ భూముల్ని లాక్కోవద్దని ఆందోళన చేసిన ఆరుగురు రైతుల్ని కాల్చి చంపించింది మీ నాన్న కాదా? రాజధాని కోసం భూములిచ్చిన రైతులు శాంతియుతంగా ఆందోళనలు చేస్తే, టెర్రరిస్టుల్లా సంకెళ్లు వేసింది ఏ రాక్షసుడి ఆదేశాలతో?’’ అంటూ ఆ లేఖలో నారా లోకేష్ రాసుకొచ్చారు.
తాజావార్తలు
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
ట్రెండింగ్
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!