Nara Lokesh: సీఎం జగన్ ఢిల్లీ టూర్ దేని కోసం? వైరల్‌గా మారిన ట్విట్టర్ పోల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే జగన్ ఢిల్లీ టూర్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ పోల్ పెట్టారు. ఈ పోల్ ద్వారా జగన్ ఢిల్లీ దేనికోసం వెళ్లారని ఆయన ప్రశ్నలు వేశారు. ఇందులో భాగంగా నాలుగు అంశాలను ప్రస్తావించారు. ఈ మేరకు పేలని జ’గన్’ హస్తిన పయనమెందుకు అంటూ ఆయన పోల్‌ను పోస్ట్ చేశారు.
ఈ పోల్‌లో తొలి అంశంగా బాబాయ్ హత్యలో దొరికిన అవినాష్ రెడ్డిని తప్పించేందుకా అని పెట్టారు. రెండో అంశంగా తాను కొట్టేస్తే కాగ్ పట్టేసిన రూ.48 వేల కోట్ల వ్యవహారాన్ని కామప్ చేయాలనా అని పేర్కొన్నారు. మూడో అంశంగా తనపై సీబీఐ, ఈడీ కేసుల దర్యాప్తు ఆపేయాలనా అని ప్రశ్నించారు. నాలుగో అంశంగా లక్షల కోట్ల ఆస్తిలో చెల్లికి చిల్లి గవ్వ కూడా దక్కకుండా మహిళలకు ఆస్తి హక్కు రద్దు చేయాలనా? అంటూ నారా లోకేష్ నిలదీశారు. ఈ నాలుగింటిలో దేని కోసం జగన్ ఢిల్లీ వెళ్లారో చెప్పాలని నెటిజన్‌లను నారా లోకేష్ కోరారు.
Also Read
- Mission Godavari Clean Project: మిషన్ గోదావరి క్లీన్ ప్రాజెక్టుకు కేంద్రం మద్దతు.. కాలుష్య అధ్యయనానికి కేంద్ర బృందం
- YS Jagan For Aqua Farmers: రైతుల కోసం మరో ఉద్యమానికి జగన్ సిద్ధం.. ప్రభుత్వానికి డెడ్‌లైన్
- NEET 2026: నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు శుభవార్త!
- Deputy CM Pawan Kalyan: గ్రామీణాభివృద్ధే లక్ష్యం.. పంచాయతీరాజ్ బలోపేతానికి కట్టుబడి ఉన్నాం..
కాగా ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న జగన్ రెండు రోజులపాటు అక్కడే ఉండనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులతో సీఎం జగన్ చర్చించనున్నారు.

Nara Lokesh Tweet
https://ntvtelugu.com/ap-cm-jagan-will-meet-with-pm-and-central-ministers-in-delhi-tour/
తాజావార్తలు
-
Rohit Sharma: చరిత్రకు మరో అడుగు దూరంలో రోహిత్ శర్మ.. భారీ స్కెచ్‌తో బరిలోకి..
-
Earthquake: చైనా, జపాన్‌లో భారీ భూకంపం.. కంపించిన భవనాలు
-
Mansukh Kaka: శభాష్ తాతా అనాలా? లేక విధి రాతను నిందించాలా?.. 82 ఏళ్ల వయసులో రోడ్డుపై కన్నీటి కష్టం!
-
FIFA World Cup: ఫిఫా వరల్డ్ కప్‌లో భారత సంతతి ఆటగాడి రికార్డ్..
-
Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్‌లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?