NTV Telugu Site icon

Nara Chandrababu Naidu: కుప్పంలో రౌడీయిజం చేస్తున్నారు.. వేషాలు వేస్తే పులివెందుల వరకు తరుముతాం..!

Chandrababu

Chandrababu

తన సొంత నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించారు.. కొన్ని ప్రాంతాల్లో.. చంద్రబాబు టూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. శాంతిపురం మండలం, కొంగణపల్లిలో చంద్రబాబు మాట్లాడుతూ.. కుప్పం నియోజకవర్గంపై ప్రభుత్వానికి శీతకన్ను వేసింది ఫైర్‌ అయ్యారు.. నేను ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా అని ఇక్కడ ఏ పనులు చెయ్యడం లేదని ఆరోపించిన ఆయన.. ఈ చేతగాని ప్రభుత్వం… మిగిలిపోయిన హంద్రీ నీవా పనులు పూర్తి చేయలేదన్నారు.. నేను నాడు పులివెందులలో పంటలు ఎండిపోతుంటే సాగు నీరు ఇచ్చాను.. నాకు ఓట్లు వేయలేదని నేను పులివెందులలో పనులు నిలిపి వేయలేదని స్పష్టం చేశారు.

Read Also: File Level Pumping System: సచివాలయంలో కొత్త విధానం.. ఫైల్ లెవల్‌ జంపింగ్‌పై జీవో జారీ

కుప్పంలో 100 కోట్లు పేదల ఇళ్లపై ఖర్చు పెట్టాం… వాటిని నిలిపివేశారని విమర్శించారు చంద్రబాబు.. కుప్పంలో అన్ని చెరువులకు నీళ్ళు ఇవ్వాలని 1350 కోట్లు కేటాయించి సగం ఖర్చు చేశాం.. కానీ, కుప్పానికి రావాల్సిన 1350 కోట్ల నిధుల జీవోలు రద్దు చేసి ఇప్పుడు రూ. 65 కోట్లు ఇస్తాం అంటున్నారని ఫైర్‌ అయ్యారు. డ్రిప్ ఇరిగేషన్ లాంటి ఉత్తమ విధానానికి ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టాను.. మైక్రో ఇరిగేషన్ కు 90 శాతం రాయితీ ఇచ్చి ప్రోత్సాహం ఇచ్చాం అని గుర్తుచేసిన ఆయన.. వైసీపీ ప్రభుత్వంలో మూడేళ్లలో ఒక్క ఎకరాకు మైక్రో ఇరిగేషన్ ఇచ్చారా? అని నిలదీశారు.. రాష్ట్రంలో సంక్షేమం కాదు… అందరినీ బాదుడే బాదుడు అని ఎద్దేవా చేశారు.. 300 యూనిట్ల విద్యుత్ వాడితే అమ్మఒడి పథకం కట్.. టాక్సీ ఉన్నా పథకాలు తీసేస్తున్నారన్నారు. ఇక, మన నియోజకవర్గం లో కొందరు రౌడీయిజం చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు.. ఇక్కడ వేషాలు వేసే వారిని పులివెందుల వరకు తరుముతామని వార్నింగ్‌ ఇచ్చారు చంద్రబాబు.

నా పర్యటనకు కావాలని అడ్డంకులు సృష్టిస్తారా? అంటూ మండిపడ్డారు చంద్రబాబు నాయుడు.. పోలీసులు న్యాయంగా ఉండాలి.., కానీ, మాట్లాడితే ఎఫ్‌ఐఆర్‌ పెడుతున్నారు. పద్దతి మార్చుకోవాలని సూచించారు. వైసీపీకి చెందిన దొంగలు, రౌడీలు గుర్తు పెట్టుకోవాలి. అందరి ఆటలు కట్టిస్తాం అని వార్నింగ్‌ ఇచ్చారు.. టీడీపీ మద్దతు దారులకు పెన్షన్ లు, పథకాలు నిలిపివేస్తే కోర్టుకు వెళ్లి న్యాయం చేస్తామన్న ఆయన.. నిలిపివేసిన పథకాలు వడ్డీ తో సహా ఇప్పిస్తాం అని ప్రకటించారు.. అందరూ పన్నులు కడుతున్నారు.. ఇదేమి వైఎస్‌ జగన్ సొంత సొమ్ము కాదు.. కుప్పంలో పథకాలు ఎందుకు నిలిపి వేస్తున్నారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నారా చంద్రబాబు నాయుడు.