Srisailam Dam: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలానికి వచ్చే భక్తులతో శ్రీశైలం ఘాట్ రోడ్డు రద్దీగా ఉంటుంది.. ఇక, శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తిన సమయంలో అయితే.. ఓ వైపు పర్యాటకులు, మరోవైపు మల్లికార్జున స్వామి భక్తులతో.. రద్దీ అమాంతం పెరిగిపోతుంది.. కొన్నిసార్లు డ్యామ్‌కు ఇరువైపులా.. అటు ఏపీ వైపు.. ఇటు.. తెలంగాణ వైపు కూడా కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ నిలిచిపోయిన సందర్భాలు అనేకం.. అయితే, ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు సిద్ధం అవుతున్నారు పోలీసులు.. శ్రీశైలాం జలాశయం వద్ద తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యలపై సున్నిపెంట పోలీసులు చర్యలు చేపట్టారు..
Read Also: Tragedy : ఇలా చేస్తే గోవాకు ఎవడు రాడు.. హైదరాబాద్ జంటపై దాడి
ట్రాఫిక్‌పై సున్నిపెంట సీఐ చంద్రబాబు, పోలీసులు సిబ్బంది డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు.. ఇటీవల కాలంలో హైదరాబాద్ – శ్రీశైలం ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ సమస్యలు అధికం కావడంతో సీఐ చంద్రబాబు డ్రోన్ కెమెరాలతో ట్రాఫిక్ ను పర్యవేక్షించారు.. అసలు, ఈ ట్రాఫిక్‌కు ఎలా నియంత్రించాలి అనేదానిపై అధ్యయనం చేస్తున్నారు.. నంద్యాల జిల్లా ఎస్పీ, ఆత్మకూరు డీఎస్పీ ఆదేశాలతో డ్రోన్ సహాయంతో ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు చర్యలకు పూనుకుంటున్నారు.. ముఖ్యంగా శని, ఆదివారాలలో శ్రీశైలం – హైదరాబాద్ రోడ్డుపై వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది.. దీంతో, ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయి.. ఈ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు ట్రాఫిక్ సమస్యపై దృష్టి పెట్టారు.. డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు పోలీసులు.. ట్రాఫిక్‌కు నిరంతరాయంగా డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నారు.. దీంతో, శ్రీశైలం డ్యామ్ వద్ద, ఆంధ్ర-తెలంగాణ బోర్డర్‌లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.. శ్రీశైలం టూటౌన్ సీఐ చంద్రబాబు.. డ్రోన్ కెమెరాలతో వినూత్నంగా ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ.. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూస్తున్నారు.. దీంతో, భక్తులు ట్రాఫిక్ కష్టాలు లేకుండా సులభంగా శ్రీశైలం రాకపోకలు సాగిస్తున్నారు పోలీసులు చెబుతున్నారు..
