TDP MLA in Controversy: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. అధికార పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలపై పలు ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి.. ఇక, టీడీపీ ఎమ్మెల్యేలు వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు.. ఎమ్మెల్యేలకు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు చెబుతున్నా… వార్నింగ్‌లు ఇస్తున్నా.. కొందరి తీరు మారడం లేదట.. అయితే, తాజాగా మరో టీడీపీ ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నారు.. శ్రీశైలం శిఖరం చెక్ పోస్ట్ వద్ద ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆయన అనుచరుల దాడి చేశారంటూ ఫారెస్ట్ సిబ్బంది ఆరోపిస్తున్నారు.. రాత్రి శిఖరం చెక్ పోస్ట్ దగ్గర తన వాహనాన్ని ఆపి హంగామా చేశారని.. శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, ఆయన అనుచరులు దాడి చేశారంటున్నారు ఫారెస్ట్ బీట్ సిబ్బంది..
Read Also: NTR Fans : మా హీరో ఏం చేశారు?.. ఏపీలో ప్రెస్ మీట్ పెట్టనివ్వలేదు!
ఆత్మకూరు నుంచి వస్తూ శిఖరం చెక్ పోస్ట్ దగ్గర తన వాహనాన్ని ఆపి ఆ రహదారిలో విధులకు వెళ్తున్న అటవీ శాఖ అధికారులను ఎమ్మెల్యే అడ్డుకున్నారని చెబుతున్నారు.. సున్నిపెంటలోని తమ కార్యాలయం నుంచి విధులకు వెళ్తున్న ఫారెస్ట్ డీఆర్‌వో మురళీ నాయక్, ఫారెస్ట్ గార్డులు గురవయ్య, మోహన్ కుమార్, డ్రైవర్ కరిముల్లాలను దుర్భాషలాడారని వాపుతున్నారు.. ఆపై ఫారెస్ట్ వాహనాన్ని తానే నడుపుతూ ఫారెస్ట్ సిబ్బందిని కూడా వాహనాల్లో ఎక్కించుకు వెళ్లారట ఎమ్మెల్యే.. తెల్లవారుజామున రెండు గంటల వరకూ వారిని ఎమ్మెల్యే, ఆయన అనుచరులు తిప్పినట్టుగా తెలుస్తుండగా.. ఫారెస్ట్ గార్డ్ గురవయ్యపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారని చెబుతున్నారు… ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి , ఆయన అనుచరులు తమపై దాడి చేశారని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు ఫారెస్ట్ సిబ్బంది.. ఈ వ్యవహారంపై పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు ఫారెస్ట్ సిబ్బంది..
