Srisailam Temple: నేడు శ్రీశైలంలో స్వర్ణ రథోత్సవం

  • శ్రీశైలంలో ఈ రోజు స్వర్ణరథోత్సవం..
  • ఆరుద్ర నక్షత్రం సందర్భంగా..
  • శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారికి స్వర్ణ రథోత్సవం..
Swarna Rathotsavam

Swarna Rathotsavam

Srisailam Temple: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో ఈ రోజు స్వర్ణరథోత్సవం నిర్వహించనున్నారు.. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారికి నేడు స్వర్ణ రథోత్సవం నిర్వహించనున్నట్లు శ్రీశైలం దేవస్థానం అధికారులు వెల్లడించారు.. మల్లికార్జునస్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించనున్నారు.. అన్నాభిషేకం, ఆలయ మాడవీధులలో స్వర్ణరథోత్సవం నిర్వహిస్తారు.. స్వర్ణరథంపై విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు ఆది దంపతులు.. ప్రతి మాసంలో ఆరుద్ర నక్షత్రం రోజు స్వర్ణరధోత్సవం నిర్వహిస్తూ వస్తుంది దేవస్థానం.. తూర్పు రాజగోపురం నుంచి నంది మండపం వరకూ స్వర్ణ రథోత్సవం నిర్వహిస్తుంటారు.. మొత్తంగా బంగారు స్వర్ణరథంపై కొలువై ఆది దంపతులు.. భక్తులను కటాక్షించనున్నారు.

Read Also: Gujarat : గుజరాత్‌లోని హిమ్మత్‌నగర్‌లో ట్రక్కును ఢీకొట్టిన కారు.. ఏడుగురు మృతి