Srisailam Ghat Road Traffic Jam: వరుస సెలవుల ఎఫెక్ట్.. శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srisailam Ghat Road Traffic Jam: వరుస సెలవుల నేపథ్యంలో శ్రీశైలం క్షేత్రానికి భక్తులు పెద్దఎత్తున తరలిరావడంతో ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భక్తులు పెద్ద సంఖ్యలో సొంత వాహనాల్లో శ్రీశైలానికి చేరుకుంటుండటంతో రహదారిపై వాహనాల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఇక, సాక్షిగణపతి నుంచి హఠకేశ్వరం వరకు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అలాగే శ్రీశైలం ముఖద్వారం నుంచి సుంన్నిపెంట వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు, భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దర్శనానికి రెండు గంటల సమయం
మరోవైపు శ్రీశైలం క్షేత్రంలో స్వామి అమ్మవార్ల దర్శనానికి కూడా భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ప్రస్తుతం స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులకు సుమారు రెండు గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. వరుస సెలవులు కావడంతో రాబోయే గంటల్లో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే, ఘాట్ రోడ్డులో భారీగా వాహనాలు నిలిచిపోవడంతో భక్తులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోతున్నారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నప్పటికీ, భారీగా తరలివచ్చిన వాహనాలతో రద్దీ కొనసాగుతోంది.
Also Read
- Sangameswara Temple: 5 వారాల్లోనే మారిన సీన్.. శ్రీశైలం డ్యామ్‌లో తగ్గుతున్న నీరు.. దర్శనమిస్తున్న సంగమేశ్వర ఆలయ శిఖరం..
- Srisailam Temple: శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
- Srisailam Water Release: గుడ్‌న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
ఇక, ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో కృష్ణానదిలో కొంత వరకు వరద పెరిగినా.. ఇప్పటి వరకు శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయిలో నిండింది లేదు.. గత ఏడాది ఈ సమయం వరకే శ్రీశైలం గేట్లు ఎత్తివేయడంతో పర్యాటకులు.. భక్తులు సందడి కనిపించగా.. 20 రోజుల క్రితం కూడా నీరు లేని శ్రీశైలం డ్యామ్‌కు ఆ తర్వాత ఇన్‌ఫ్లో కాస్త పెరగడంతో.. ఓ స్థాయి వరకు నీటిమట్టం చేరుకుంది.. అయితే, శ్రీశైలం జలాశయానికి వరద తగ్గిపోయింది.. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు.. ప్రస్తుత నీటిమట్టం 878 అడుగుల వరకు చేరుకోగా.. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది..
తాజావార్తలు
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..