Srisailam Temple: నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలో 25వ తేది నుంచి ఆగష్టు 24 వరకు శ్రావణా మాసోత్సవాలు జరగనున్నాయి. శ్రావణ మాసోత్సవాలపై దేవస్థానం అధికారులు, సిబ్బందితో ఆలయ ఈవో శ్రీనివాసరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. శ్రావణమాసంలో భక్తుల రద్దీ దృశ్య మొత్తం 16 రోజులు గర్భాలయ, సామూహిక అభిషేకాలు నిలుపుదల చేస్తున్నారు. శ్రావణ మాసంలో ఆగస్టు 15 నుంచి 18 వరకు స్పర్శ దర్శనం ఆపేస్తున్నట్లు ప్రకటించారు.
ఇక, భక్తులందరికి శ్రీస్వామివారి అలంకార దర్శనం.. శ్రావణ మాసంలో శనివారం, ఆదివారం, సోమవారం, పర్వదినాలలో గర్భాలయ, సామూహిక అభిషేకాలు నిలుపుదల చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే, ఆగష్టు 15 నుంచి 18వ తేదీ మినహా మిగిలిన రోజులలో రోజుకు 3 విడుతలుగా స్వామివారి స్పర్శ దర్శనానికి అనుమతి ఉంటుందని ప్రకటించారు. శ్రావణమాసంలో భక్తుల సౌకర్యార్థమై రెండుసార్లు ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించనున్నట్లు శ్రీశైల ఆలయ అధికారులు వెల్లడించారు.