శ్రీశైలం భక్తుల రద్దీ కారణంగా ఈ వారం ఉచిత స్పర్శదర్శనం నిలిపేశారు. జలాశయం గేట్లు తెరవడంతో గత రెండు రోజులుగా క్షేత్రంలో భారీగా భక్తుల రద్దీ నెలకొంది. భక్తుల రద్దీ ఈ వారమంతా కొనసాగే అవకాశం ఉంది. రద్దీ దృష్ట్యా 15వ తేదీ నుంచి 18 వరకు ఉచిత స్పర్శదర్శనం నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ సిబ్బంది పేర్కొన్నారు. సర్వదర్శనం క్యూలైన్లలోని భక్తులందరికీ శ్రీస్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు.
Srisailam Temple: నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలో 25వ తేది నుంచి ఆగష్టు 24 వరకు శ్రావణా మాసోత్సవాలు జరగనున్నాయి. శ్రావణ మాసోత్సవాలపై దేవస్థానం అధికారులు, సిబ్బందితో ఆలయ ఈవో శ్రీనివాసరావు సమీక్ష సమావేశం నిర్వహించారు.