Security lapse at Srisailam: శ్రీశైలం ఆలయంలో భద్రతా వైఫల్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Security lapse at Srisailam: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో భద్రతా వైఫల్యం వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. ఉగాది మహోత్సవాల సందర్భంగా గర్భగుడిలో శ్రీస్వామివారిని ఓ భక్తుడు సెల్‌ఫోన్‌లో వీడియో తీయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దేవాలయంలో మొబైల్ ఫోన్లు, వీడియో కెమెరాలకు అనుమతి లేకపోయినప్పటికీ, ఒక సామాన్య భక్తుడు వాటిని లోనికి తీసుకెళ్లడం భద్రతా లోపాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. వీడియో తీసిన వ్యక్తి కర్ణాటక రాష్ట్రానికి చెందిన భక్తుడిగా గుర్తించినట్లు సమాచారం. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన దేవస్థానం అధికారులు, సంబంధిత భక్తుడిపై కేసు నమోదు చేసే యోచనలో ఉన్నారు. ఈ ఘటనపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ నియమాలను ఉల్లంఘించడం పట్ల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Also: MP Putta Mahesh Clarifies: ఎంపీ పుట్టా మహేష్ వివరణ.. ఇప్పుడు టెస్ట్ చేసుకున్నా నేను సిద్ధమే..
Also Read
- Sangameswara Temple: 5 వారాల్లోనే మారిన సీన్.. శ్రీశైలం డ్యామ్‌లో తగ్గుతున్న నీరు.. దర్శనమిస్తున్న సంగమేశ్వర ఆలయ శిఖరం..
- Srisailam Temple: శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
- Srisailam Ghat Road Traffic Jam: వరుస సెలవుల ఎఫెక్ట్.. శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
మరోవైపు, శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. భ్రమరాంబ దేవి నిజరూప అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే అశ్వవాహనంపై శ్రీస్వామి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదిదంపతుల ఆలయ ప్రదక్షిణ కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. ఈ రోజుతో శ్రీశైలం ఉగాది మహోత్సవాలు విజయవంతంగా ముగిశాయి. మొత్తం మీద, ఒకవైపు వైభవంగా జరిగిన ఉత్సవాలు, మరోవైపు భద్రతా లోపం.. ఈ రెండు అంశాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
తాజావార్తలు
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
ట్రెండింగ్
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..