NTV Telugu Site icon

Minister BC Janardhan Reddy: ప్రజా సేవే ముఖ్యం.. మాది కక్ష సాధింపు ప్రభుత్వం కాదు..

Bc Janardhan Reddy

Bc Janardhan Reddy

Minister BC Janardhan Reddy: మాకు రైతులకు.. ప్రజలకు సేవనే మాకు ముఖ్యం.. మాది కక్ష సాధింపు ప్రభుత్వం కాదు అని స్పష్టం చేశారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.. నంద్యాలలోని ఆర్.ఏ.ఆర్.ఎస్.లో నిర్వహిస్తోన్న కిసాన్ మేళా 2024ను ప్రారంభించారు మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్.ఎం.డీ. ఫరూక్.. ఆ తర్వాత స్టాళ్లను పరిశీలించారు ఇద్దరు మంత్రులు.. ఈ కార్యక్రమానికి వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు హాజరుకావాల్సి ఉన్నా గైర్హాజరయ్యారు.. ఇక, ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ హయాంలో ఆందోళనలు చేసిన రైతులపై కేసులు పెట్టారని గుర్తుచేశారు.. రైతులను రౌడీ షీటర్లుగా మార్చారని ఆరోపించిన ఆయన.. కలెక్టరేట్ వద్ద వైస్సార్సీపీ నేతలు ఆందోళనలు చేస్తే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదన్నారు..

Read Also: Prabhas: ఫ్యాన్స్ కు ప్రభాస్ సారీ.. వీడియో రిలీజ్

అసలు కక్ష సాధింపు చర్యలను చంద్రబాబు ప్రోత్సహించరు అని పేర్కొన్నారు మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి.. మాకు రైతులకు, ప్రజలకు సేవనే ముఖ్యం అన్నారు.. ఇక, ఓర్వకల్లు వద్ద డ్రోన్ హబ్ ను ఏర్పాటు చేస్తాం అన్నారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. మరోవైపు.. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను పాటించి, మంచి దిగుబడిని సాధించాలని పిలుపునిచ్చారు మంత్రి ఎన్.ఎం.డీ. ఫరూక్.. ఇక, కోర్ట్ తీర్పు ప్రకారం కలెక్టరేట్ ఖాళీ చేసి, ఇతర ప్రాంతాలకు తరలించి భూమిని ఆర్.ఏ.ఆర్.ఎస్.కు అప్పగించాలని డిమాండ్ చేసిన బొజ్జ దశరథ రామ్ రెడ్డి.

Read Also: China: బాస్‌కు స్వాగతం పలికేందుకు ఉద్యోగులు వింత ప్రవర్తన.. ఏం చేశారో తెలిస్తే..!

Show comments