NTV Telugu Site icon

Nandyala: క్రిప్టో కరెన్సీ పేరుతో రూ. 25 కోట్లు వసూలు చేసిన మోసగాడు..

Crypto Currency

Crypto Currency

నంద్యాల జిల్లా డోన్‌లో ఘరానా మోసం వెలుగు చూసింది. క్రిప్టో కరెన్సీ పేరుతో రామాంజనేయులు అనే మోసగాడు సుమారు రూ. 25 కోట్లు వసూలు చేశాడు. బైనాన్స్, ఒకే-ఎక్స్ యాప్స్‌లో ట్రేడింగ్ చేస్తూ, లక్ష పెట్టుబడికి నెలకు పదివేలు ఇస్తామంటూ నమ్మబలికాడు కేటుగాడు.. అలా దాదాపు రూ. 25 కోట్లు వసూలు చేశారు. కర్నూలు, నంద్యాల, మహబూబ్ నగర్ జిల్లాల్లో 300 మందికి పైగా భాదితులు ఉన్నట్టు సమాచారం.

Read Also: GV Prakash Kumar: దీపావళికి డబుల్ బొనాంజా

మరోవైపు.. తాము మోసపోయామని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. పోలీసులు మోసగాడిని 45 రోజులుగా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గత 45 రోజులుగా నిందితుడిపై కేసు నమోదు చేయకపోగా.. కాలయాపన చేస్తున్న పోలీసుల తీరుపై బాధితులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 45 రోజులైనా భాదితులకు న్యాయం జరగక పోవడంతో లబోదిబోమంటున్నారు. డోన్ లో 2021 నుండి కేవ-ఇండస్ట్రీస్ ఆర్గానిక్ హెర్బల్ కంపెనీ పేరుతో ప్రజలకు పరిచయం చేసుకున్నాడు కేటుగాడు. గతంలో అనంతపురంలో రూ. 90 లక్షలు మోసం చేసినట్టు రామాంజనేయులుపై అభియోగాలు ఉన్నాయి. మోసగాడు అనంతపురం జిల్లా పెద్దవడుగురు వాసిగా గుర్తించారు పోలీసులు.

Read Also: Mayonnaise: మయోన్నైస్ వల్ల ఎన్ని అనారోగ్య సమస్యలు వస్తాయో తెలుసా?