తెలంగాణ ప్రభుత్వం ఇటీవల మయోన్నైస్ పై నిషేధం విధించిన విషయం తెలిసిందే.. దీని వల్ల ఎలాంటి అనారోగ్యం సమస్యలు తలెత్తుతాయో చూద్దాం.  

 మయోన్నైస్ ఓ చట్నీలాంటి పదార్థం.. చాలా రుచిగా ఉంటుంది. నోట్లో పెట్టగానే ఉప్పగా తాకుతుంది. 

 షవర్మాలు, మోమోస్, ఫ్రెంచ్ ఫ్రైస్ లో ఎక్కువగా వీటిని మయోన్నైస్‌లో ముంచుకొని తింటూ ఉంటారు. 

అయితే.. మయోనైస్ తరచూ తినేవారు అధిక బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే దీనిలో ఉండే కొవ్వులు అనారోగ్యకరమైనవి.

 దీన్ని ఎక్కువగా తింటే గుండె ఆరోగ్యానికి చేటు జరిగే అవకాశం ఉంది. కొంతమందికి ఇది అలెర్జీకి కారణం కావచ్చు. 

తిన్న వెంటనే కొన్ని రకాల అలెర్జీ లక్షణాలు కనిపిస్తాయి. అలా కనిపిస్తే మీరు గుడ్లతో చేసిన మయోన్నైస్‌కు దూరంగా ఉండాలని అర్థం.

పచ్చి గుడ్లతో తయారు చేసే మయోన్నైస్ తయారీలో ఏమాత్రం తప్పు జరిగినా అందులో సాల్మొనెల్లా అనే బాక్టీరియా చేరుతుంది.

ఈ సాల్మొనెల్లా బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ ప్రాణాంతకంగా మారుతుంది. కాబట్టి ఇలా నిల్వచేసిన మయోనైస్ ను తినకపోవడమే మంచిది.

 అయితే ఇది ఎక్కువ కాలం తాజాగా ఉండాలని ఉప్పును అధికంగా కలుపుతున్నారు. అధిక రక్తపోటు బారిన పడే అవకాశం ఉంది