NTV Telugu Site icon

Bhuma Akhila Priya: నాకూ రెడ్‌ బుక్‌ ఉంది.. ఎవ్వరినీ వదలను..! భూమా అఖిల ప్రియ సంచలనం..

Bhuma Akhila Priya

Bhuma Akhila Priya

Bhuma Akhila Priya: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో గత కొంత కాలం నుంచి రెడ్‌బుక్‌పై తీవ్ర చర్చ సాగుతోంది.. మంత్రి నారా లోకేష్‌ రెడ్‌ బుక్‌లో ఎవరెవరి పేర్లు ఉన్నాయనే ఆందోళన కూడా నెలకొంది.. మరోవైపు.. నాకూ ఒక రెడ్‌బుక్‌ ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆమె.. నాకు కూడా రెడ్ బుక్ ఉంది.. అందులో 100 మందికిపైగా ఉన్నారు.. ఎవ్వరినీ వదిలే ప్రసక్తే లేదన్నారు.. అంటే వారిని నేను ఏదో కట్టె పట్టుకొని కొడతానని కాదు.. చంపేస్తానని కాదు.. ఖచ్చితమైన ఆధారాలతో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంతోమందిపై తప్పుడు కేసులు బనాయించారు.. అలాంటి వరికి ఇప్పుడు ఇబ్బందులు తప్పవన్నారు.. నేను ఎవ్వరినీ ఇబ్బంది పెట్టను అని చెప్పానా? అధికారంలోకి వస్తే.. తోలు తీస్తానని చెప్పాను.. అతే తరహాలో ఉంటానన్నారు.

Read Also: Karnataka: తల్లి ఫిర్యాదును నిరాకరించిన పోలీసులు.. తహశీల్దార్ వాహనానికి నిప్పు పెట్టిన కొడుకు

ఇక, ఒక్కొక్కరికి లెక్కకి లెక్క చెబుతాను అని చెప్పా.. చెప్పి తీరుతా అన్నారు అఖిలప్రియ.. నాకు రెడ్‌ బుక్‌ ఉంది.. అందులో వంద మంది పేర్లు ఉన్నాయి.. ఇద్దరు ముగ్గురు పేర్లను పాపం అని తీసేశాను.. కానీ, వంద మందిని నేను ఇబ్బంది పెట్టబోతున్నాను అని వ్యాఖ్యానించారు.. అయితే, తప్పు చేస్తేనే భయపడంది.. లేకపోతే హ్యాపీ ఉండండి అని పేర్కొన్నారు.. మరోవైపు.. మాజీ ఎమ్మెల్యే గంగుల డిగ్రీ కాలేజీ తెచ్చానని చెప్పుకుంటున్నాడు.. పేరుకే డిగ్రీ కాలేజ్.. కానీ, సరైన వసతులు కూడా లేవు అని దుయ్యబట్టారు అఖిల ప్రియ.. కనీసం స్వీపర్లు కూడా లేక విద్యార్థులతో గదులు శుభ్రం చేయిస్తున్నారని విమర్శించారు.. మాజీ ఎమ్మెల్యే బ్రిజేంద్ర రెడ్డికి కేవలం దొంగ ఓటర్ మాత్రమే అని ఆరోపించారు.. సస్పెండ్ అయిన ప్రిన్సిపాల్ ని తీసుకొచ్చి డిగ్రీ కాలేజీకి వేయించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకునేది లేదు అంటూ హెచ్చరించారు భూమా అఖిలప్రియ..

Show comments