Srisailam Dam Gates Lifted: కృష్ణమ్మ మరోసారి పరవళ్లు తొక్కుతుంది.. శ్రీశైలం జలాశయానికి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది.. దీంతో.. ఈ సంవత్సరంలో రెండోవసారి రేడియల్ క్రెస్టు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు అధికారులు.. శ్రీశైలం జలాశయంలోని రెండు రేడియల్ క్రెస్టు గేట్లు 10 అడుగులు మేర ఎత్తి దిగువ నాగార్జునసాగర్ కు నీటి విడుదల చేస్తున్నారు అధికారులు.. ప్రస్తుతం డ్యామ్‌కు ఇన్ ఫ్లో 2,13,624 క్యూసెక్కులుగా ఉండగా.. ఓవైపు రెండు గేట్లు ఎత్తివేత.. మరోవైపు.. విద్యుత్ ఉత్పత్తి నేపథ్‌యంలో.. డ్యామ్ నుంచి ఔట్ ఫ్లో 1,22,876 క్యూసెక్కులుగా ఉంది.. ఇక, శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నిండుకుండలా అంటే.. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు చేరింది నీటిమట్టం.. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 215.8070 టీఎంసీలుగా నీటినిల్వ ఉంది.. కుడి గట్టు జలవిద్యుత్ కేంద్రంతో పాటు.. ఎడమ గట్టు జల విద్యుత్ కేందంలోనూ విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది..
Read Also: Devara 3rd SOng : ‘దేవర’ మూడో పాట.. అడగకండి.. ఎప్పుడొచ్చినా భీభత్సమే!
మరోవైపు.. నాగార్జునసాగర్ డ్యాం 2 క్రస్ట్ గేట్లు పది అడుగుల మేర ఎత్తి 30,026 క్యూసెక్కుల నీటిని మంగళవారం నుంచి దిగవకు విడుదల చేస్తు్న్నారు అధికారులు.. శ్రీశైలం నుంచి భారీగా ఇన్ ఫ్లో సాగర్ కు రావడంతో మరికొద్ది సేపట్లో ఇంకో నాలుగు గేట్లను కూడా ఎత్తనున్నారు అధికారులు.. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ యొక్క పూర్తి స్థాయినీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 590 అడుగులకు చెరుకుంది.. నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీల గాను ప్రస్తుతం 312 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నుండి కుడి, ఎడమ కాలువలకు, జంట నగరాల తాగునీటి అవసరాల కొరకు, మొత్తం 78,854 క్యూసెక్కుల నీటిని ఔట్ ఫ్లో రూపంలో వదుతున్నారు అధికారులు.. విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది..