Fake Websites: నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో నకిలీ వెబ్‌సైట్ల కలకలం భక్తుల్లో ఆందోళనకు గురి చేస్తుంది. శ్రీశైలం దేవస్థానం అధికారిక వెబ్‌సైట్‌ను పోలిన నకిలీ వెబ్‌సైట్ ద్వారా వసతి బుకింగ్ పేరుతో మోసాలు చేస్తున్నట్లు గుర్తించారు. వసతి విభాగానికి చెందిన నకిలీ వెబ్‌సైట్లలో గదులు బుక్ చేసి పలువురు భక్తులు మోసపోయిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే, బెంగళూరుకు చెందిన ఓ ఆర్మీ అధికారి, అలాగే హైదరాబాద్‌కు చెందిన మరో భక్తుడు ఈ నకిలీ సైట్ ద్వారా రూములు బుక్ చేసుకున్నారు.
Read Also: Keerthy Suresh : మహానటి తర్వాత సినిమా అవకాశాలు రాలేదు
ఇక, అధికారిక వెబ్‌సైట్‌ను నమ్మి గదులు బుక్ చేసిన భక్తులు శ్రీశైలానికి చేరుకుని హరిత అతిథి గృహం దగ్గర రూములు తీసుకోవడానికి వెళ్లిన భక్తులు బుకింగ్ స్లిప్స్ చూపించగా అవి నకిలీ అని అధికారులు తెలియజేయడంతో వారు షాక్ అయ్యారు. ఏపీ టూరిజం వెబ్‌సైట్‌ను కూడా పోలిన నకిలీ వెబ్‌సైట్లు ఉండటంపై భక్తులు తీవ్ర ఆందోళన పడుతున్నారు. ఇలాంటి మోసపూరిత వెబ్‌సైట్లకు బలి కాకుండా జాగ్రత్తగా ఉండాలని దేవస్థానం ఈఓ శ్రీనివాసరావు భక్తులకు సూచించారు. భక్తులు నకిలీ వెబ్‌సైట్లతో మోసపోయినట్లు వచ్చిన పిర్యాదులపై సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేస్తామని ఆలయ ఈఓ శ్రీనివాసరావు వెల్లడించారు.