NTV Telugu Site icon

Naga Babu: వైసీపీ అసమర్ధ పాలనకు ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి?

Naga Babu

Naga Babu

Naga Babu: ఏపీ ప్రభుత్వం తమ బకాయిలు చెల్లించడం లేదని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి ఈ అంశంపై ఫిర్యాదు చేశారు. తమ సమస్యలను పరిష్కరానికి గవర్నర్ కల్పించుకొని చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తమకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించేలా గవర్నర్ చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నేతలు విన్నవించారు. ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం చెల్లించడంలేదంటూ గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ అంశంపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు స్పందించారు.

Read Also: Revanthreddy : అప్పుడు గవర్నర్ స్పందిస్తే.. ఇప్పుడు ఇబ్బంది ఉండేది కాదు

ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై గవర్నర్ కు ఫిర్యాదు చేయడం చరిత్రలో ఇదే మొదటిసారి అని నాగబాబు చురకలు అంటించారు. డీఏ, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, రిటైర్మెంట్ ప్రయోజనాలు అందక ఆందోళన చేయడానికి అనుమతి దొరకని పరిస్థితులలో ఉద్యోగులు గవర్నర్‌ను కలిశారని నాగబాబు ఆరోపించారు. వైసీపీ అసమర్థ పాలనకు ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఇంకేం కావాలని ఆయన ప్రశ్నించారు. ఆర్టికల్ 309 ప్రకారం ఉద్యోగ వ్యవస్థపై ప్రత్యక్ష సంబంధాలు, అధికారాలు కలిగి ఉన్న గవర్నర్‌కు తమ పరిస్థితి మొరపెట్టుకునే స్థాయికి ఉద్యోగులను తీసుకొచ్చారని నాగబాబు విమర్శించారు. కాగా ఈనెల 21, 22 తేదీల్లో కర్నూలు, అనంతపురం జిల్లాల్లో జనసేన నేత నాగబాబు పర్యటించనున్నారు. ఈ నెల 21న కర్నూలు జిల్లా వీరమహిళల సభలో పాల్గొంటారు. అదే రోజు మధ్యాహ్నం జనసైనికుల సభకు హాజరవుతారు. ఈ నెల 22న అనంతపురం జిల్లాలో వీరమహిళలు, జనసైనికుల సభల్లో పాల్గొంటారు.

Show comments