NTV Telugu Site icon

Nagababu: వైసీపీ, ఆర్జీవీపై ఓ రేంజ్‌లో ఫైర్‌ అయిన నాగబాబు.. మీ తాత, అయ్యా ఇచ్చారా?

Nagababu

Nagababu

Nagababu:ఏపీలోని అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, దర్శకుడు రాంగోపాల్‌వర్మ (ఆర్జీవీ)పై ఓ రేంట్‌లో ఫైర్‌ అయ్యారు మెగా బ్రదర్‌, జనసేన నేత నాగబాబు.. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన యువశక్తి సభ నేపథ్యంలో ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ప్యాకేజీ స్టార్‌ అంటూ పవన్‌ కల్యాణ్‌పై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.. ప్యాకేజీ మీ అమ్మమొగుడిచ్చారా..? అని కొడాలి స్టైల్‌లో అడుగుతున్నానన్నారు.. కానీ, అలా అనను.. సినిమాకు కోట్లాది రూపాయలు తీసుకునే మాకు ప్యాకేజీ అవసరమా..? అని ప్రశ్నించారు. మీ లాగా లక్షలాది, కోట్లాది రూపాయలు మావద్ద లేవు.. మాకున్న కొద్ది పాటి డబ్బుని, రిసోర్స్ ను అందరికీ పంచుతున్నామని వెల్లడించారు.. ప్యాకేజీ అంటూ బావ దారిద్య్రంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. మీ తాత, అయ్యా మాకు ప్యాకేజీ ఇచ్చారా? అని నిలదీశారు.. మేం అన్ని కులాలను గౌరవిస్తాం.. మాకు కుల పిచ్చి లేదని స్పష్టం చేశారు నాగబాబు.

Read Also: Somireddy Chandramohan Reddy: సోమిరెడ్డిని 3 గంటలు విచారించిన సీబీఐ.. అంతా కాకాని పుణ్యమేనన్న మాజీమంత్రి

ఇక, రేపటి యువశక్తి సభ ఎక్స్ లెంట్‌గా ఉంటుంది అన్నారు నాగబాబు.. భయం లేకుండా యువత మాట్లాడేవిధంగా ప్లాట్ పాం ఏర్పాటు చేశాం.. యువత ఆలోచనలు, కోరికలు, రాష్ర్ట అభివృద్ధికి ఇచ్చే సూచనలు తీసుకుంటాం అన్నారు.. యువతను దిశా నిర్దేశం చేయటానికి మా పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ వద్ద కొన్ని ప్రణాళికలు ఉన్నాయి.. రేపు పవన్ ప్రకటిస్తారని వెల్లడించారు. మరోవైపు రాంగోపాల్‌వర్మపై సంచలన వ్యాఖ్యలు చేశారు నాగబాబు.. రాంగోపాల్ వర్మ పెద్ద వెదవ.. సన్నాసి.. నీచ్ కమీన్‌ కుత్తె.. అలాంటి వారి గురించి నేను మాట్లాడబోను అన్నారు.. వాడు అవసరం కోసం ఎంతకైనా దిగజారుతాడని ఫైర్‌ అయ్యారు.. నేను కాపు కులంలో పుట్టాను.. కాపు కులంతో పాటు అన్ని కులాలను గౌరవిస్తాను.. కానీ, కులపిచ్చి లేదన్నారు.. ఒక కులం గురించి మాట్లాడడం తప్పు అని హితవుపలికిన ఆయన.. కాపులకు ఆత్మాభిమానం లేదా..? అని ప్రశ్నించారు.. అసలు ఏ కులమైనా ఎందుకు అమ్ముడు పోతుంది.. అందరికీ ఆత్మాభిమానం ఉంటుందిగా? అన్నారు. ఎన్టీఆర్‌ని, చంద్రబాబుని, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని, మళ్లీ చంద్రబాబును.. ఇప్పుడు సోకాల్డ్ అడ్డగాడిదలను కూడా గెలిపించింది కాపులే అని తెలిపారు.. అసలు కాపు కులాన్ని తాకట్టు పెట్టే హక్కు మాకు ఎక్కడుందని నిలదీశారు నాగబాబు.