NTV Telugu Site icon

Nadendla Manohar: జూన్ 14 నుంచి పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభిస్తారు

Nadendla Varahi Poster

Nadendla Varahi Poster

Nadendla Manohar Released Varahi Yatra Poster: గుంటూరులో జనసేన నేత నాదెండ్ల మనోహర్ సోమవారం సాయంత్రం వారాహి యాత్ర పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనసేనాధినేత పవన్ కళ్యాణ్ జూన్ 14వ తేదీన కత్తిపూడి జంక్షన్ నుంచి వారాహి యాత్రను ప్రారంభిస్తారని స్పష్టం చేశారు. అన్నవరం సత్యదేవుని సన్నిధిలో పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పత్తిపాడు నుంచి పర్యటన మొదలుపెడతారని చెప్పారు. ఈ యాత్రలో పవన్ కళ్యాణ్ అన్ని వర్గాల ప్రజల్ని కలిసేలా ప్రణాళిక రచించినట్టు వెల్లడించారు. ఒక్కో నియోజకవర్గంలో రెండు రోజుల పాటు పవన్‌ వారాహి యాత్ర కొనసాగనుందని.. ప్రతి రోజు ఉదయం బస చేసిన ప్రాంతంలో స్థానిక సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారని, వీటి పరిష్కారానికి అక్కడి నుంచే ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తారన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ జనవాణి కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. గతంలో 2 వేల అర్జీలను తాము అధికారులకు పంపామని, మేధావి వర్గంతో సమావేశాలు ఉంటాయని అన్నారు.

Kakani Govardhan Reddy: ఏం జరిగినా.. వైసీపీకి ఆపాదించడం పరిపాటిగా మారింది

ఈ యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్.. వైసీపీ పాలనలో జరుగుతున్న అరాచకాలను, ప్రజలకు జరిగిన నష్టాలను తెలియజేస్తారని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్ట్.. జగననన్న పాపం పథకంగా మారిందని ఆరోపించారు. డబ్బుల కోసం పోలవరం ఎత్తు తగ్గించారని పేర్కొన్నారు. ఇటీవల కేంద్రం 17,140 కోట్ల నిధులను పోలవరం ప్రాజెక్టు కోసం రిలీజ్ చేసిందని గుర్తు చేశారు. పోలవరం ఎత్తు తగ్గించారని స్వయంగా కేంద్రమే చెప్పిందని చెప్పారు. ఎప్పుడూ లేనంతగా.. సీఎం జగన్ ఇప్పుడే హడావుడిగా పోలవరం పర్యటనకు ఎందుకు వెళ్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. 14 వేల‌ మంది నిర్వాసితులకు ఏ విధమైన న్యాయం చేస్తారని ప్రశ్నించారు. రిటైనింగ్ వాల్ డ్యామేజికి కారణం ఏమిటి? అవినీతా, నాణ్యతా లోపమా? అని నాదెండ్ల మనోహర్ నిలదీశారు.

Amruta Fadnavis: ఈ డిప్యూటీ సీఎం భార్య యమా హాట్ గురూ..